కొత్త డ్రింక్ తెస్తున్న కేంద్రం.. ఫుల్ బాటిల్ రూ.700కే

Update: 2020-03-22 12:30 GMT
విస్కీ, రమ్ము, బీరు, వొడ్కా మందులు మనందరికీ అలవాటే.. కానీ ఈ ఆరోగ్యానికి హాని చేసే మందులకు తోడు ఒక పూలతో తయారయ్యే మందును కేంద్రం తీసుకొస్తోంది. తొలిసారి ఓ ఆల్కాహాలిక్ డ్రింక్ ను కేంద్ర ప్రభుత్వం మార్కెట్లో ప్రవేశపెట్టబోతోంది.

ఇప్ప పూలతో తయారు చేసే ఈ మందును త్వరలోనే మార్కెట్లోకి తీసుకు రాబోతోంది. 750 ఎంఎల్ ఫుల్ బాటిల్ ను కేవలం రూ.700కే అమ్మేందుకు ప్లాన్ చేస్తున్నారు. 6 రకాల పండ్ల రుచుల్లో దీన్ని తయారు చేస్తున్నారు.

ఈ ఇప్పపూవు మందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయని కేంద్రం తెలిపింది. అల్కహాల్ స్థాయి 5శాతం వరకు ఉంటుంది. ట్రైఫెడ్, ఢిల్లీ ఐఐటీ కలిసి ఈ ఇప్ప పూవు డ్రింక్ ను తయారు చేశాయి.  దేశవ్యాప్తంగా అమ్మేందుకు లైసెన్స్ తీసుకోవాలని ట్రైఫెడ్ ఎండీ ప్రవీర్ తెలిపారు.  

అమూల్ పాల బ్రాండ్ లాగానే తాము పాపులర్ అవుతామని దీని తయారీదారు ట్రైఫెడ్ ఎండీ ప్రవీర్ తెలిపారు. ఇప్పపూలు, చింతపండు తో పదార్థాలు, పచ్చడులు తయారు చేసి అమ్ముతామని.. కేంద్రం దీనికి సానుకూలంగా ముందుకు రావడం స్వాగతిస్తున్నామన్నారు.

ఇక ఇప్ప పూలను చత్తీస్ ఘడ్ లోని బస్తర్ అడవుల నుంచి సేకరిస్తున్నారు. ఇప్పపూవులో విటమిన్లు, కాల్షియం, ఖనిజలవణాలు ఎక్కువ. ఈ పువ్వులను పులియబెట్టి బీర్ లాంటిది తయారు చేస్తారు. ఈ కంట్రీ బీర్ తోపాటు ఇప్పుడు కేంద్రమే కొత్త డ్రింక్ ను తయారు చేస్తోంది. ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ మందు కోసం మందుబాబులు కూడా ఎదురుచూస్తున్నారు.
Tags:    

Similar News