తెలంగాణలో కొత్త జిల్లాల లెక్కలివే..

Update: 2016-09-16 04:27 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలకు సంబంధించి మరో ముందడుగు పడింది. దసరా రోజు నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని 27జిల్లాలుగా మార్చాలన్న సంకల్పాన్ని సాకారం చేసుకునే దిశగా ఇప్పటికే ఎంతో కసరత్తు జరిగిన విషయం తెలిసిందే. ఓపక్క దసరా దగ్గర పడుతున్న వేళ.. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన పనులు వేగవంతమయ్యాయి. తాజాగా కొత్తగా ఏర్పడనున్న జిల్లాలకు సంబంధించిన గణాంకాల్నితెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాల వారీగా జనాభా వారీ వివరాల్ని వెల్లడించటంతో పాటు.. ఆయా జిల్లాల్లో దళితులు.. గిరిజనులు.. మైనారిటీల వివరాల్నివెల్లడించింది. రాష్ట్రం మొత్తమ్మీదా 3.5 కోట్ల మంది జనాభా ఉండగా.. ఇందులో 15 శాతం ఎస్సీలు.. 14 శాతం మైనార్టీలు.. 9 శాతం ఎస్టీలు ఉన్నట్లుగా తేలింది. అంతేకాదు.. పలు ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.

మొత్తం 27 జిల్లాల్లో ఎస్సీలు అత్యధికంగా ఉన్న జిల్లాగా కొమురంభీమ్ (22శాతం) నిలవగా.. 21 శాతంగా హన్మకొండ.. నాగర్ కర్నూలు ఉన్నాయి. ఇక 19 శాతం జనాభా ఉన్న జిల్లాలుగా మూడు జిల్లాలు (సూర్యాపేట.. సిద్దిపేట.. పెద్దపల్లి) ఉన్నాయి. అత్యల్పంగా హైదరాబాద్ (6 శాతం) జిలవగా.. తర్వాతి స్థానంలో మల్కాజ్ గిరి (9శాతం) జిల్లా నిలిచింది. ఎస్టీల విషయానికి వస్తే.. అత్యధికంగా మహబూబాబాద్ (38 శాతం) నిలవగా.. తర్వాతి స్థానంలో కొత్తగూడెం (37శాతం) నిలిచాయి. అత్యల్పంగా హైదరాబాద్ (1 శాతం) జిల్లా ఉండటం గమనార్హం.
Read more!

మైనార్టీల విషయానికి వస్తే.. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 46 శాతం (18.20లక్షలు) ఉండగా.. తర్వాతి స్థానంలో నిజామాబాద్ (20శాతం) తర్వాతి స్థానంలోనిలిచింది. అత్యల్పంగా నాలుగు శాతంగా జయశంకర్ జిల్లా నిలిచింది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ తర్వాత హైదరాబాద్ అన్నింటి కంటే పెద్ద జిల్లాగా అవతరించింది. ఈ జిల్లాలో జనా 39.43 లక్షలు కాగా.. జయశంకర్ జిల్లా (భూపాలపల్లి) జిల్లా అతి తక్కువ జనాభాతో ఉండనుంది. ఈ జిల్లాలో జనాభా కేవలం 6.54 లక్షలు మాత్రమే ఉండటం గమనార్హం. అత్యధిక జనాభా ఉన్న జిల్లాగా హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో శంషాబాద్ (20.51 లక్షలు).. మల్కాజ్ గిరి (24.40 లక్షలు) ఉన్నాయి. 10 లక్షల లోపు జనాభా ఉన్న జిల్లాలు పది మాత్రమే కావటం గమనార్హం.
Tags:    

Similar News