నాన్న మాటలే స్ఫూర్తి.. దేశం కోసం ఎంతటి బాధైనా దిగమింగుతా.. సిరాజ్
మహ్మద్ సిరాజ్ అద్భుతమైన యువ పేసర్. ఐపీఎల్ 2020లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి టీంఇండియాకు ఎంపికయ్యాడు. ఎంతో గొప్ప అవకాశం దక్కిందని కుటుంబ సభ్యులు సంతోషంగా ఫీలయ్యారు. సిరాజ్ కూడా ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లాడు. కానీ అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే ఓ పిడుగులాంటి వార్త అతడి చెవిన పడింది. తనను గొప్ప క్రికెటర్ గా టీం ఇండియా తరపున ఎదిగితే చూడాలనుకున్న తన తండ్రి ఇక లేడన్న వార్త తెలిసింది. తనలో ఎంతో స్ఫూర్తి నింపిన తండ్రి తుదిశ్వాస విడిచాడన్న వార్త విని సిరాజ్ కుప్ప కూలాడు. విషయం తెలిసిన బీసీసీఐ అతడిని ఇండియాకు పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ సిరాజ్ మాత్రం ఇండియాకు వెళ్లేందుకు ఒప్పుకోలేదు. ‘ఇప్పుడు నేను ఇండియాకు వెళ్లడం కంటే.. టీం ఇండియా తరఫున ఆడితేనే నా తండ్రి ఆత్మ శాంతిస్తుంది’ అని బీసీసీఐ కి చెప్పాడు. బీసీసీఐ చైర్మన్ గంగూలి కూడా సిరాజ్ నిర్ణయం విని ఎంతో ఆశ్చర్య పోయాడు. సిరాజ్ వజ్ర సంకల్పాన్ని మెచ్చుకున్నాడు. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లోనే ఆటగాడి ఆత్మ స్థైర్యం, నైతిక పరివర్తన బయట కు వస్తాయని ప్రశంసించాడు.
మరోవైపు సిరాజ్ తల్లి కూడా అతడితో భావోద్వేగంతో మాట్లాడారు. 'నువ్వు దేశానికి ఆడాలనేది నీ తండ్రి కల. దాన్ని నిర్వర్తించడమే నీ ముందున్న కర్తవ్యం. చక్కటి ప్రదర్శనతో అందరి మనసులు గెలుచుకో’ అని తన తల్లి సిరాజ్కు చెప్పింది. ఈ సందర్భంగా సిరాజ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ మాది చాలా బీద కుటుంబం నా తండ్రి ఆటో నడుపుతూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాడు. అతడి కోరిక తీర్చడం నా బాధ్యత. కెప్టెన్ కోహ్లీ కూడా నాకు స్ఫూర్తి నింపాడు. నాకు ధైర్యం చెప్పాడు. ఈ టూర్ లో బాగా రాణించి అందరి మన్ననలు పొందాలన్నదే నా ధ్యేయం.
'మేరా బేటా దేశ్‌కా నామ్ రోషన్ కరేగా' అని మా నాన్న ఎప్పుడూ అంటుండేవారు. ఆ మాటలు నాకెప్పటికీ గుర్తుంటాయి. ’ అని సిరాజ్ చెప్పాడు. 2007లో ఢిల్లీ తరఫున రంజీట్రోఫీ మ్యాచ్ ఆడుతున్నప్పుడు కోహ్లీ తన తండ్రిని కోల్పోయాడు. అయినా తర్వాతి రోజు మైదానంలో అడుగుపెట్టిన విరాట్ 97 పరుగులు సాధించాడు. అప్పుడు కోహ్లీ అందరి మెప్పు పొందాడు. ఇప్పుడు సిరాజ్ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. తండ్రి చనిపోయిన బాధను దిగమింగుకొని.. దేశం తరఫున ఆడేందుకు నిర్ణయించుకున్న సిరాజ్ తెగువను వాళ్లు మెచ్చుకుంటున్నారు.