• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కత్తి మహేశ్ లో ఉన్నది.....

కత్తి మహేశ్ లో ఉన్నది.. పోసానిలో మిస్ అయినది ఇదే

By - Tupaki Desk
Update: 2021-09-29 06:40 GMT
భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే బలప్రదర్శనకు సరిపోయేది. కానీ.. ఇప్పుడు రోజులు మారాయి. బలప్రదర్శనకు కొత్త కొత్త వేదికలు వచ్చాయి. కోట్లాది మంది అభిమానులుఉన్నా.. వారందరికి ఉలిక్కిపడేలా చేసి.. వారి చేత తప్పులు చేయించి.. ఆ తప్పులు మొత్తం తాము టార్గెట్ చేసే వారి ఖాతాలోకి వేసే సరికొత్త అస్త్రంగా కొందరిని సిద్ధం చేసుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. ఆ కోవలోకే వస్తారు కత్తి మహేశ్.. పోసాని క్రిష్ణమురళీ.. శ్రీరెడ్డి.. దిలీప్ సుంకర తదితరులు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. రాజకీయాలకు సంబంధించి తమకు తాము తోపులగా అభివర్ణించే తెలుగుదేశం పార్టీకి.. పేరున్న ఇలాంటి అస్త్రాలు ఎక్కడా కనిపించరు.

వీరి కారణంగా.. కొత్త తరహా వాదనల్ని వినిపిస్తూ ఉంటారు. క్రియాశీలక రాజకీయాల్లో కనిపించని వీరు.. ఎవరికి వారు తమకు తగిన ప్రొఫెషన్ లో ఉంటూ.. తమ వాదనను సగటు అభిమానిగా.. విమర్శకుడిగా.. ఇంకా ఏదో ఒక తోకను తగిలించుకొని తమ టార్గెట్లను చేధిస్తుంటారు. పవన్ కల్యాణ్ మీద మొదట్నించి వ్యూహాత్మకంగా.. .కొత్త తరహాలో విమర్శల దాడి జరగటం తెలిసిందే.

ఆ మాటకు వస్తే.. సినిమాల్లో వచ్చిన కొత్తల్లో.. స్టార్ డమ్ వస్తున్నవేళ.. పవన్ మీద మిగిలిన వారికి కాస్త డిఫరెంట్.. అంటూ మీడియాలో సన్నాయి నొక్కులు నొక్కేవారు. అయితే.. పవన్ పీఆర్ టీం బలంగా లేకపోవటం.. ఏదైనా సరే సూటిగానే తప్పించి.. లోపాయికారీగా వ్యవహరించటం చేతకాకపోవటంతో.. ఆయన ఇమేజ్ ను అభిమానులే బిల్డ్ చేశారే తప్పించి.. మీడియా కానీ మరే ఇతర శక్తులు కానీ చేసింది లేదు.

కానీ.. ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేసే విషయంలో మాత్రం కొందరు కీలకభూమిక పోషించారని చెప్పాలి. ఈ జాబితాలో మహేశ్ కత్తి  కూడా ఉంటారు. పవన్ ను అభిమానించే వారికి ఏ మాత్రంనచ్చని రీతిలో.. .ఆయన అభిమానుల పేరుతో పవన్ ఇమేజ్ ను ప్రశ్నించటం.. కొత్త తరహా వాదనను వినిపిస్తూ ఉండేవారు. కత్తి మహేశ్ మాటల్ని విన్నంతనే సగటు అభిమానికి కోపం కలిగించేలా ఉన్నా.. ఆయన ఎప్పుడు గీత దాటింది లేదు. హద్దులు చెరిపేసింది లేదు.

అందుకు భిన్నంగా తాజగా పోసాని మాత్రం అన్ని గీతల్ని.. హద్దుల్ని దాటేశారని చెప్పాలి. రాయలేని.. వాడలేని బూతుల్ని ప్రయోగించటమేకాదు.. పవన్ మీద కోపంతో.. పవన్ తల్లిని.. పెళ్లాన్ని కూడా వదిలిపెట్టనంటూ ఆయన అనేసిన మాటల పైత్యం చూసినోళ్లంతా మండిపడుతున్నారు. ఈ కారణంతోనే పవన్ మీద ఎంతఅభిమానం ఉన్నా కత్తి మహశ్ చేసే విమర్శల్ని చూసి చూడనట్లుగా ఉన్నవారు సైతం.. పోసాని మాటల్ని మాత్రం సీరియస్ గా తీసుకుంటున్నారని చెప్పక తప్పదు.
Tags:    
  • posani krishna murali 
  • posani krishna murali comments 
  • posani krishna murali fire 
  • Pawan kalyan 
  • Pawan kalyan comments 

Similar News

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS