సబ్బులు, టూత్ పేస్టుల్లో వాడే రసాయనంతో నరాల బలహీనత..!
సబ్బులు, టూత్‌పేస్టుల్లో వాడే ఓ రసాయనం ఆరోగ్యానికి చాలా హానికరమని హైదరాబాద్ ఐఐటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ట్రైక్లోసాన్ అనే ఓ రసాయన పదార్థాన్ని సబ్బులు, టూత్పెస్టులు, కాస్మొటెక్స్లో వాడుతుంటారు. ఈ రసాయనం మనిషి శరీరంలోని నరాలవ్యవస్థను దెబ్బతీస్తుందని.. శాస్త్రవేత్తలు గుర్తించారు. ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అనామిక భార్గవ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధన చేపట్టింది. ఇందుకు సంబంధించిన అంశాలను బ్రిటన్‌కు చెందిన ‘కెమోస్పియర్’ అనే జర్నల్‌లో ప్రచురించడంతో దీనికి విశేష ప్రాధాన్యం లభించింది.
సబ్బులు, టూత్‌పేస్టులు ఎక్కువ కాలం పాడవకుండా ఉండేందుకు ఈ రసాయనాన్ని అందులో వాడుతుంటారు. ఈ రసాయనం శరీరంలోని వెళితే చాలా ప్రమాదమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ట్రైక్లోసాన్ అనే రసాయనం సూక్ష్మజీవులను చంపేస్తుంది. ఇది గనక శరీరంలోని వెళితే నరాల వ్యవస్థ దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
పరిశోధన ఎలా సాగించారు..
ట్రైక్లోసాన్ మానవశరీరంపై ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలుసుకొనేందుకు శాస్త్రవేత్తలు ఈ రసాయనాన్ని జెబ్రా చేపలపై ప్రయోగించారు. అయితే వాటిలో నరాల వ్యవస్థ దెబ్బతిన్నది. జెబ్రా చేపలు, మనిషి శరీరనిర్మాణం ఒకేలా ఉంటుంది. కాబట్టి మనిషి మీద కూడా ఇదే తరహా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ రసాయనం వాడితే న్యూరో బిహేవియరల్ ఆల్టరేషన్స్ వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాబట్టి దీని వినియోగాన్ని తగ్గించాలని.. లేదంటే తక్కువ మోతాదులో వాడేలా ఆదేశాలు జారీచేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.