భారత్ పై బుల్లి దేశానికి కోపం.. న్యాయముందా?
బుల్లి దేశానికి భారత్ మీద కోపమొచ్చింది. దేశానికి అనుకొని ఉండే భారత మిత్రదేశమైన నేపాల్ కు మన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎందుకిలా? అలాంటి పరిస్థితి ఎందుకు? ఆ ఆగ్రహంలో న్యాయముందా? దాని వెనుక ఉన్నదెవరు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికినప్పుడు.. కొన్ని లెక్కలు బయటకు వస్తాయి. ఇంతకీ నేపాల్ కు కోపమొచ్చే పని భారత్ ఏం చేసిందన్నది చూస్తే..
ప్రతి ఏటా వేలాది భారతీయులు కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లేందుకు తెగ తపిస్తుంటారు. ప్రయాణం చేసే అవకాశం దక్కితే.. అదో అదృష్టంగా ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి మరీ ఈ ప్రయాణానికి వెళ్లేందుకు వెనుకాడరు. అయితే.. ఈ యాత్రలో భాగంగా చైనా భూభాగం నుంచి ప్రయాణించాల్సి ఉంటుంది. అంతేకాదు.. యాత్రలో భాగంగా దగ్గర దగ్గర వారం పాటు నడవాల్సి ఉంటుంది.
ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టటంతో పాటు..దేశ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం మోడీ సర్కారు కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. భారత భూభాగంలో కొత్త రోడ్డు వేయాలని మోడీ సర్కారు డిసైడ్ అయ్యింది. ఈ నిర్ణయం నేపాల్.. చైనాలకు మింగుడుపడనిదిగా మారింది. దీనికి కారణం లేకపోలేదు. ఈ రోడ్డు వేయటం ద్వారా.. చైనా సరిహద్దులకు చాలా త్వరగా చేరుకునే వీలుంది. అంతేకాదు.. మానస సరోవర్ యాత్రికుల కాలి నడక ఏకంగా ఆరు రోజుల పాటు తగ్గిపోనుంది. అంతేకాదు.. ఈ రోడ్డు నిర్మాణం పుణ్యమా అని.. చైనాలో ప్రయాణించే సమయం తగ్గిపోవటమే కాదు.. ఆ దేశంపై ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
ఈ ప్రయోజనాల్ని పరిగణలోకి తీసుకున్న కేంద్రం.. నేపాల్ కు సరిహద్దుల్లో ఉండే భారత భూభాగంలో కొత్త రోడ్డు వేసేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ వ్యవహారం డ్రాగన్ దేశానికే కాదు.. నేపాల్ కు మింగుడు పడనిదిగా మారింది. ఇదే.. బుల్లిదేశానికి భారత్ మీద గుస్సా కావటానికి కారణం. ఇరు దేశాల సరిహద్దుల వివాద పరిష్కారానికి కుదుర్చుకున్న ఒప్పందానికి వ్యతిరేకంగా.. ఏకపక్షంగా భారత్ ఈ రోడ్డును ఏర్పాటు చేసిందని నేపాల్ ఆరోపిస్తోంది.
అయితే.. ఈ విమర్శల్ని కొట్టి పారేస్తోంది భారత్. ఎందుకంటే.. కొత్తగా నిర్మించిన రోడ్డు మొత్తం తమ భూభాగంలోనే అన్న విషయాన్ని మర్చిపోకూడదని భారత్ గట్టిగానే స్పందించింది. ఇంతకీ నేపాల్ ఆందోళనలో అర్థముందా? అంటే.. లేదనే చెప్పాలి. కాకుండా నేపాల్ దేశ ప్రయోజనాల్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు.. ముప్పు లేకున్నా.. ఒక పెద్ద దేశం తమ సరిహద్దుల్ని ఇట్టే చేరుకునే రోడ్డు నిర్మాణం నేపాలీలకు మింగుడుపడనిదిగా మారిందని చెప్పాలి. భారత్ వైఖరి తెలిసి కూడా ఈ గుస్సా వెనుక చైనా హస్తం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.