కరోనా పై విజయం ..ఇంటికి వచ్చిన మహిళకి షాక్ ఇచ్చిన స్థానికులు !
యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ భయంతో వణికిపోయేలా చేస్తుంది. ఈ వైరస్ దెబ్బకి ప్రపంచంలోని చాలా దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయారు. ముఖ్యంగా ఇతర దేశాల నుండి వచ్చిన వారిలోనే ఈ కరోనా వైరస్ ఎక్కువగా బయటపడుతుండటంతో కరోనా ఇండియాలో వ్యాప్తి చెందటం మొదలుపెట్టిన తరువాత విదేశాల నుండి వచ్చిన వారందరికీ కరోనా టెస్టులు నిర్వహించి , వారిలో కరోనా పాజిటివ్ వచ్చిన వారికీ ఐసోలేషన్ వార్డ్ లో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారు.
ఇకపోతే , కరోనా మహమ్మారి నుంచి కోలుకుని తిరిగి ఇంటికి వచ్చిన ఓ మహిళ కు అనుకోని సంఘటన ఎదురైంది. కరోనా వ్యాధి నుంచి కోలుకున్నా, చుట్టు పక్కన వారు ఎలా చూస్తారో అనే బెంగతో కారు దిగి భయం భయంగా ఇంటికి వెళ్లిన ఆ మహిళకి కరత్వాన ధ్వనులతో అపూర్వ స్వాగతం లభించింది. ఇంటి చుట్టు పక్కన వాళ్లు, స్థానికులు అందరూ వరుసగా నిల్చొని కరోనాపై విజయం సాధించినందుకుగానూ శంఖం ఊదుతూ, చప్పట్లు కొడుతూ, ధరువులతో మహిళకు ఘన స్వాగతం పలికారు. ఇంతటి అపూర్వ స్వాగతం చుసిన ఆ మహిళా ఆనందంతో కంటతడి పెట్టింది.
ఈ ఘటన పై ఆ మహిళా మాట్లాడుతూ ..."20 రోజులుగా ఐసోలేషన్‌లో ఉన్న నాకు, కుటుంబాన్ని కలవడానికి వచ్చే ముందు ఎన్నో ఆలోచనలు మదిలో స్పృశించాయి. ఇంటికి రాగానే నన్ను చూసి అందరూ దూరంగా వెళతారని భావించా. కానీ, కరోనా నుంచి కోలుకుని వచ్చిన నాకు మా కాలనీ వాసులు పలికిన స్వాగతం జీవితంలో మర్చిపోలేనిది అని తెలిపారు. మార్చి తొలివారంలో ఫిన్‌ల్యాండ్ లోని నార్తర్న్ లైట్స్‌కి విహారయాత్రకు వెళ్లాను. కరోనా మహమ్మారి ప్రబలుతుందనే సమయంలోనే తిరిగి ఇంటికి వచ్చాను. అప్పటికీ భారత్‌లో కేసులు తక్కువగా నమోదయ్యాయి, అయినా అందరికి దూరంగానే ఉన్నాను , అయితే , కరోనా లక్షణాలు కనిపించడం తో వెంటనే హాస్పిటల్ కి వెళ్లానని , అక్కడ కరోనా పాజిటివ్ వచ్చనిది అని తెలిపింది. కరోనా సోకింది అని తెలియగానే భయపడిపోయి అని , ఆ తరువాత అక్కడ డాక్టర్లు, నర్సులు ఇచ్చిన మనోధైర్యం నా వ్యాధి తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడింది అని ఆమె తెలిపారు.