క్వీన్ ఎలిబిజెత్ కు నెహ్రూ నో చెప్పారా..?

Update: 2015-07-26 06:00 GMT
చరిత్రలో కలిసి పోయిన విషయాలు అనుభవాల రూపంలో కానీ.. గురుతుల రూపంలో కానీ బయటకు వస్తుంటాయి. వీటిల్లో కొన్ని రహస్య పత్రాలు బయటకు వెల్లడి అయినప్పుడో.. లేదంటే.. అధికారానికి చాలా దగ్గర ఉన్న వారు తమకు తెలిసిన నిజాల్ని పుస్తకాల రూపంలో బహిర్గతం చేసినప్పుడు చాలానే విషయాలు బయటకు వస్తుంటాయి.

తాజాగా అలాంటి ఎన్నో అంశాలు తాజాగా బయటకు వచ్చాయి. భారత రాష్ట్రపతి అదనపు కార్యదర్శిగా పని చేసిన థామస్ మాథ్యూస్ అనే పెద్ద మనిషి.. అబోడ్ అండర్ ద డోమ్డ్ అనే పుస్తకాన్ని రచించారు.  ఈ సందర్భంగా ఆయన 1947 నుంచి 1967 మధ్యన చోటు చేసుకున్న వివిధ అంశాల్ని తన పుస్తకంలో ప్రస్తావించారు. రాష్ట్రపతికి అదనపు కార్యదర్శిగా వ్యవహరించటంతో ఆయనకు పలువురు విదేశీ ప్రముఖులకు సంబంధించిన విషయాల్ని చాలా దగ్గరిగా చూసే వీలు దక్కినట్లుగా చెప్పాలి.

అలా ఆయన చెప్పిన విషయాల్లో భారత తొలి ప్రధాని నెహ్రూకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. బ్రిటన్ రెండో రాణి ఎలిజబెత్ భారత్ కు వచ్చిన సందర్భంగా చోటు చేసుకున్న ఒక ఘటన చోటు చేసుకుందట. 1961లో భారత్ కు వచ్చిన క్వీన్ ఎలిజబెత్ జైపూర్ లో పులిని వేటాడాలని భావించారట. తెగ ముచ్చట పడిపోయిన ఆమె.. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరారట.

పులికి ఎరగా ఒక దూడను వేయాలన్న ఏర్పాట్లు చేయాలని భారత్ ను బ్రిటన్ ప్రభుత్వం కోరిందట. అయితే.. రాణి గారి సరదా కోసం ఒక మూగ జీవాన్ని బలి చేయటం కుదరదని రాణిగారికి చెప్పేశారట.

అంతేకాదు.. ఇదే పుస్తకంలో మరో ఆసక్తికరమైన ఉదంతం పలువుర్ని ఇట్టే ఆకర్షిస్తోంది. అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ 1969లో భారత్ ను సందర్శించారు. ఆయనతో పాటు.. ఆయన సతీమణి పాట్ నిక్సన్ కూడా వచ్చారు. ఆమెను చూసిన నాటి ఢిల్లీ శివారు ప్రజలంతా.. ఆమెను చంద్రుడ్ని జయించిన దేశం నుంచి తీసుకొచ్చారని.. ఆమె చంద్రలోకం నుంచి వచ్చిన మహిళగా భావించారట.
Tags:    

Similar News