• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌...

శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసు .... మాజీ మంత్రి తనయుడు ఇంట్లో డ్రగ్స్‌

By - Tupaki Desk
Update: 2020-10-24 14:00 GMT
శాండల్‌ వుడ్‌ లో వెలుగు చూసిన డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసును దర్యాప్తు చేస్తున్న బెంగళూరు కేంద్ర క్రైమ్ బ్రాంచ్ అధికారులు అన్ని అంశాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో కొంత మంది ప్రముఖులు , అలాగే వారి బంధువులు పేర్లు కూడా ఉన్నాయి. ఇక ఈ లిస్ట్‌లో ఆదిత్య అల్వా కూడా నిందితులుగా ఉన్నారు. ఆదిత్య అల్వా మాజీ మంత్రి జీవరాజ్‌ అల్వా కుమారుడు, బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ సోదరుడు. శాండల్ ‌వుడ్ డ్రగ్ కేసులో కాటన్‌పేట్ పోలీస్ స్టేషన్‌ లో నమోదు చేసిన ఎఫ్ ‌ఐఆర్‌ లో ఆదిత్య 6వ నిందితుడిగా ఉన్నారు. ఆదిత్య అల్వా నివాసంలో ఎన్‌ సీబీ అధికారులు దాడులు చేయగా 55 గ్రాముల పొడి గంజాయి లభించింది.

లాక్‌ డౌన్‌ సమయంలో ఆల్వా డ్రగ్స్‌ పార్టీలు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతను డ్రగ్‌ పెడ్లర్లతో సన్నిహితంగా ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. పార్టీలో డ్రగ్స్‌ సేకరించి, సరఫరా చేయడంలో ఆదిత్య అల్వా ప్రధాన పాత్ర పోషించాడని ఇప్పటికే ఎన్ ‌సీబీ విచారిస్తున్న నిందితుడు రవిశంకర్‌ అంగీకరించాడు. ఆదిత్య అల్వా పేరు వెలుగులోకి రావడంతో సెప్టెంబర్‌ 4 నుంచి పరారీలో ఉన్నాడు. అతనిపై ఎఫ్‌ ఐఆర్‌ నమోదు అవడంపై ఆయన కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇంతవరకు ఆయనకు ఉపశమనాన్ని కలిగించలేదు. నాలుగు ఎకరాలలో విస్తరించిన ఈ బంగ్లాను ఆదిత్య అల్వా పార్టీలు నిర్వహించడానికి ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. ఇక ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన వారిలో సినీ నటులు రాగిణి ద్వివేది, సంజన గల్రానీ, పార్టీ ఆర్గనైజర్ వీరెన్ ఖన్నా, రియల్టర్ రాహుల్, ఆర్టీఓ గుమస్తా బి.కె.రవిశంకర్ ఉన్నారు.
Tags:    
  • Aditya Alwa 
  • NCB 
  • Caught 
  • Drugs 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS