భారత సంతతి లాయర్ అమెరికాలో కాల్పులు!

Update: 2016-09-28 06:24 GMT
అమెరికాలో కాల్పుల సంఘటనలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. అగ్రరాజ్యంలో దాదాపు ప్రతిరోజూ ఏదో ఒక మూల సామాన్యులపై కాల్పులు జరుగుతున్నాయి! ఇదే క్రమంలో తాజాగా మరోసారి హ్యూస్టన్ నగరంలో భారత సంతతికి చెందిన న్యాయవాది ఒకరు సైనిక దుస్తులు ధరించి కాల్పులు జరిపాడు. ఈ సమయంలో అతడు నాజీ సానుభూతిపరుడిలా స్వస్తిక్ గుర్తు ధరించి ఉన్నాడు. ఈ న్యాయవాది జరిపిన కాల్పుల్లో సుమారు తొమ్మిది మంది గాయపడ్డారు. అయితే ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకున్న పోలీసులు అతడిని కాల్చి చంపారు.

స్థానిక టీవీ చానల్ కథనం ప్రకారం... నాథన్ దేశాయ్ (46) అనే భారత సంతతి లాయర్ ఒక హ్యాండ్‌ గన్ - మరో సబ్ మిషన్‌ గన్ పట్టుకుని సుమారు 20 నిమిషాల పాటు వచ్చిపోయే వాహనాల మీద - పోలీసుల మీద కాల్పులు ఏకదాటిగా కాల్పులు జరిపారు. ముందుగానే అవసరమైన మందుగుండు సామగ్రిని అన కారులో నిల్వ చేసుకున్న నాథన్... ఒక చెట్టు వెనక నిలబడి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో గాయపడిన వారిలో ఒకరు మరణించగా మిగిలిన వారు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ మేరకు మృతి చెందిన - గాయపడిన వారి వివరాలు హ్యూస్టన్ పోలీసు చీఫ్ మార్తా మోంటావ్లో తెలిపారు. అయితే నాథన్ దేశాయ్‌ కి అతడి న్యాయసంస్థలో కొన్ని సమస్యలున్నాయని - దాంతో అతడు అక్కడకు వచ్చిన పోలీసులపై కాల్పులు జరిపాడని, ఆ సమయంలో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో అతడు మరణించాడని చెబుతున్నారు.

అయితే ఈ విషయాలపై స్పందించిన నాథన్ దేశాయ్ తండ్రి... అతడి న్యాయవాద ప్రాక్టీసు పెద్దగా బాగోకపోవడంతో బాగా ఆవేదన చెందేవాడని - కాల్పులకు 12 గంటల ముందే ఇద్దరం కలిసి భోజనం చేశామని - అయితే తన కొడుకు ఇలా చేశాడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని తెలిపారు. అయితే ఈ భారతీయ మూలాలున్న లాయర్ నాథన్ దేశాయ్ ఎందుకు ఇలా కాల్పులు జరిపాడన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News