మ‌ళ్లీ యుగాంతం... ఇప్పుడు కూడా నాసా చెప్పేసింది!

Update: 2020-11-08 17:50 GMT
యుగాంతం... ఈ వార్త తెర‌మీద‌కు వ‌చ్చిందంటే ఒళ్లు జ‌ల‌ద‌రించి పోతుంది. అసలే కరోనాతో ఓ వైపు ప్రపంచం గజగజవణికిపోతుంటే త్వ‌ర‌లో ప్రపంచం కనుమరుగవుతోందని పిడుగు లాంటి మరో వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 2068లో యుగాంతం కానుంద‌ని నాసా చేసిన‌ ప్రకటన టెన్షన్ సృష్టిస్తోంది.


2020 సంవత్సరంలో ఓ భారీ గ్రహ శకలం భూమికి సమీపంగా వెళ్తుందని మూడేళ్ల క్రితం నాసా ప్రకటించిన సంగతి తెలిసిందే. గడిచిన 400ఏళ్లలో కానీ.. రాబోయే మరో 500 ఏళ్లలో కానీ భూమికి ఇంత సమీపంలోకి రానున్న గ్రహశకలం మరేది ఉండబోదని మాత్రం నాసా స్పష్టం చేసింది. అయితే, అది కాస్తా వ‌ట్టిదేన‌ని తేలిపోయింది. అయితే, తాజాగా అదే నాసా పేరుతో అదే యుగాంతం వైర‌ల్ అవుతోంది.  2068లో ఓ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయని అదే జరిగితే సమస్త జీవరాశి నాశనం అవుతుందని నాసా ఓ విషయాన్ని బయటపెట్టింది.

నాసా ముందుగా సేక‌రించిన‌ వివ‌రాల ప్ర‌కారం ఈ గ్ర‌హ శ‌క‌లం 2029లో భూమిని ఢీకొడుతుందని తేలింది. అయితే, మ‌రింత లోతుగా అధ్య‌య‌నం చేయ‌గా ఆ అవకాశాలు 3శాతం కంటే తక్కువే అని తర్వాత క్లారిటీకి వచ్చారు. అయితే, వ‌చ్చే 9 సంవ‌త్స‌రాల్లో త‌ప్పిపోయిన‌ప్ప‌టికీ 2068లో మాత్రం భూమిని ఢీకొట్ట‌డం ఖాయ‌మంటున్నారు. ఇదే జ‌రిగితే యుగాంత‌మేన‌ని ప్ర‌జ‌లు వణికిపోతున్నారు. ఇంత‌కీ యుగాంతం జ‌రుగుతుందా? గ‌తంలో వ‌లే ఉత్తి ప్ర‌చార‌మేనా? ‌తేలాలంటే మ‌రికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.
Tags:    

Similar News