ప్రపంచ సూఫీ ఫోరంలో మోడీ మాట్లాడుతుంటే..?
మోడీకి ముస్లింలకు అస్సలు పడదని చెబుతుంటారు. ఇందులో నిజం ఎంతన్నది ఎవరెంత చెప్పినా.. వినే వాళ్ల మనసుల్లో మాత్రం ఓ రేంజ్ లో సందేహాలు ఉంటూనే ఉంటాయి. మరి.. అలాంటి ముద్ర ఉన్న మోడీ.. ముస్లింలకు సంబంధించిన కార్యక్రమాలకు హాజరు కారా? అంటే ఎంచక్కా హాజరవుతుంటారు. ఇస్లాం ధర్మాన్ని చెబుతుంటారు. వారికి సంబంధించిన అంశాల గురించి కూడా మాట్లాడుతుంటారు.
అలాంటి మోడీ తాజాగా ఢిల్లీలోని ప్రపంచ సూఫీ ఫోరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనో ప్రసంగం చేశారు. శాంతి.. సహనం.. ప్రేమను కాంక్షించే వారి సంగమమే సూఫీ సమావేశాలుగా ఆయన అభివర్ణించారు. వేర్వేరు ప్రాంతాలు.. సంస్కృతులు అనుసరించే సూఫీ మతస్థులందరిని ఒకచోట కలిపింది.. వారి మధ్యనున్న నమ్మకమే అని చెప్పుకొచ్చిన ఆయన.. సూఫీ ధర్మాన్ని ఆచరించే వారంతా భగవంతుడికి అతి దగ్గరగా జీవిస్తారని వ్యాఖ్యానించారు.
ఇస్లాం అంటే శాంతి అని.. అల్లా 99 పేర్లలో హింస అని అర్థం వచ్చే పదం ఒక్కటి కూడా అందులో కనిపించదని మోడీ చెప్పుకొచ్చారు. ఉగ్రవాదాన్ని మతంతో జోడించవద్దన్న ఆయన పాల్గొన్న సమావేశంలో.. ‘‘భారత్ మాతాకీ జై’’ అన్న నినాదాలు భారీగా వినిపించటం గమనార్హం. ఈ నినాదాల్ని ఎక్కడున్నాడో కానీ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వింటే బాగుంటుంది.