నమస్తే ట్రంప్ : ప్రధాని మోదీ స్పీచ్ హైలెట్స్ !

Update: 2020-02-24 10:01 GMT
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ - భారత పర్యటన సందర్భంగా అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న ట్రంప్ ..అక్కడి నుండి బయల్దేరి వెళ్లి - సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ కాసేపు - అప్పటి పరిస్థితులని మోదీ - ట్రంప్ దంపతులకి వివరించారు. ఆ తరువాత నమస్తే ట్రంప్ కార్యక్రమంలో భాగంగా.. మొతేరా స్టేడియానికి చేరుకున్నారు. అహ్మాదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి మోతెరా స్టేడియం వరకు దాదాపు 22 కిలోమీటర్ల మేర రోడ్ షో జరిగింది. రోడ్డుకిరువైపులా ప్రజలు నిలబడి ఘన స్వాగతం పలికారు. ఇక నమస్తే ట్రంప్ కార్యక్రమానికి సభా ప్రాంగణం అయిన  ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన  మొతెరా క్రికెట్‌ స్టేడియం భారత్‌ మాతాకీ జై’ నినాదాలతో హోరెత్తింది. లక్షా 20 వేల సీటింగ్‌ సామర్థ్యం ఉన్న స్టేడియం జనంతో కిక్కిరిపోయింది.   సినీ - రాజకీయ - వ్యాపార - క్రీడా ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ - ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ ను సభకు పరిచయం చేసిన అనంతరం ప్రధాని మోదీ నమస్తే ట్రంప్‌ కార్యక్రమాన్ని భారత్‌ మాతాకీ జై అంటూ  ప్రారంభించారు. ఇండియా..యూఎస్‌ ఫ్రెండ్‌ షిప్‌ అంటూ ప్రధాని నినాదాలు చేశారు. భారత్‌-అమెరికా స్నేహం ఎప్పటికి ఇలాగే ఉండాలని నినాదాలు చేసారు.  మొతెరా క్రికెట్‌ స్టేడియంలో ఒక కొత్త చరిత్ర ప్రారంభమైంది. అహ్మదాబాద్‌ లో నమస్తే ట్రంప్‌ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ట్రంప్‌ - ఆయన కుటుంబం సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు. ఇది గుజరాతీ గడ్డ అయినా యావత్తు దేశమంతా దీన్ని స్వాగతిస్తోంది. భిన్నత్వంలో ఏకత్వం అన్నదానికి ఇదే నిదర్శనం. ట్రంప్‌ ఆయన భార్య మెలానియా - కూతురు ఇవాంక - అమెరికా యావత్తు భారత్‌ తో బలమైన సంబంధాలను కోరుకుంటోంది అని తెలిపారు.అలాగే  ట్రంప్‌ కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం..మనకు ఆయన ఇచ్చే ప్రాధాన్యతను తెలుపుతోందన్నారు.

మీది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అయితే.. మాది స్టాట్యూ ఆఫ్ యూనిటీ అన్న మోదీ డైలాగ్‌ కు గ్రౌండ్ మొత్తం అరుపులతో దద్దరిల్లింది. భారత్ - అమెరికాలు చాలా విషయాల్లో సహాయ సహకారాలు అందించుకుంటున్నాయని తెలిపారు. అహ్మదాబాద్‌కు ఎంతో చరిత్ర ఉంది. భారత స్వాతంత్ర్య పోరాటంలో సబర్మతీ నదికి విశిష్టపాత్ర ఉంది. మనం అనుసరిస్తున్న భిన్నత్వంలో ఏకత్వం.. భారత్‌ అమెరికాలను కలుపుతుంది అని తెలిపారు. ట్రంప్‌ రాక దీనికి కచ్చితంగా దోహదపడుతుది. అభివృద్ధి - సౌభ్రాతృత్వానికి బాటలు వేస్తుంది. అమెరికాలో సమాజాభివృద్ధికి మెలానియా కృషిని ప్రశంసిస్తున్నాం. బాలల సంక్షేమానికి మెలానియా చేసిన కృషి అభినందనీయం. ఇవాంక రెండేళ్ల క్రితం భారత్‌ కు వచ్చారు. మరోసారి ఇవాంకకు స్వాగతం పలకడానికి సంతోషిస్తున్నాఅని తెలిపారు. అలాగే హ్యూస్టన్‌ లో హౌడీ మోదీ కార్యక్రమానికి కొనసాగింపుగానే ఇప్పుడు ఇండియా లో  నమస్తే ట్రంప్‌ కార్యక్రమం నిర్వహించినట్టు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.  ఆ తరువాత ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడిన తరువాత మరోసారి ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ ..ప్రెసిడెంట్ అంటూ మాట్లాడారు. భారత చరిత్ర - అభివృద్ధిని కొనియాడినందుకు ట్రంప్‌ కు కృతజ్ఞతలు తెలిపారు. భారత్ సాధించిన అభివృద్ధిని మోడీ వివరించారు. అమెరికాతోనే అత్యధిక వాణిజ్య ఒప్పందాలు భారత్ చేసుకుందని చెప్పారు. రక్షణ రంగంతోపాటు చాలా రంగాల్లో అమెరికాతో సత్ససంబంధాలు కొనసాగుతున్నాయని , భారత్-అమెరికా కలిసి సాంకేతికంగా దూసుకెళ్తాయని అన్నారు. భారత్-అమెరికా స్నేహబంధం చిరకాలం కొనసాగాలని ప్రధాని మోడీ తన ప్రసంగంలో కోరుకున్నారు.
Tags:    

Similar News