ల‌క్ష కంపెనీల‌కు దిమ్మ తిరిగే షాకిచ్చిన మోడీ

Update: 2017-07-02 04:20 GMT
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జీఎస్టీ అమ‌లుకు 48 గంట‌ల ముందు ఊహించ‌ని ప‌రిణామం ఒక‌టి చోటు చేసుకుంది. జీఎస్టీతో లాభం ఎంత‌? న‌ష్టం ఎంత‌? అన్న సందేహాల‌తో లెక్క‌లు వేసుకుంటూ.. జీఎస్టీ మీద అవ‌గాహ‌న పెంచుకోవ‌టం కోసం కిందా మీదా ప‌డుతున్న వేళ‌.. గుట్టుచ‌ప్పుడు కాకుండా జ‌రిగిపోయిన ఒక ఉదంతం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చి సంచ‌ల‌నంగా మారింది.

జీఎస్టీ అమ‌లుకు స‌రిగ్గా 48 గంట‌ల ముందు.. బ‌య‌ట‌కు రాని ఒక ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. జీఎస్టీ ఫీవ‌ర్ దేశాన్ని నిండుగా ఆవ‌హించిన రోజు.. ఒక నిశ్శ‌బ్ద నిర్ణ‌యం దేశాన్ని కుదిపేసింది. ఒక్క క‌లంపోటుతో దాదాపు ల‌క్షకు పైగా కంపెనీల రిజిస్ట్రేష‌న్ల‌ను కేంద్రం ర‌ద్దు చేసింది.

ఈ కంపెనీల‌న్నీ అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లుగా కేంద్రం గుర్తించింది. పెద్ద నోట్ల ర‌ద్దు వేళ‌.. ప‌లు షెల్ కంపెనీలు.. అక్ర‌మాల‌కు పాల్ప‌డే కంపెనీలను గుర్తించారు. వీటి కార్య‌క‌లాపాల‌పై ఒక క‌న్నేసి.. ర‌హ‌స్యంగా విశ్లేషించారు. చివ‌ర‌కు తాము అనుక‌న్న‌ట్లే ఇవ‌న్నీ డొల్ల కంపెనీలన్న విష‌యాన్ని గుర్తించిన మోడీ స‌ర్కారు.. ఈ త‌ర‌హా కంపెనీలపై సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకుంది.

అనుమానాస్ప‌ద వైఖ‌రితో వ్య‌వ‌హ‌రిస్తున్న కంపెనీల రిజిస్ట్రేష‌న్ల‌ను డీ రిజిస్ట‌ర్ చేశాయి. అంతేకాదు.. అక్ర‌మ ప‌ద్ధ‌తుల్లో కార్య‌క‌లాపాలు నిర్వ‌ర్తిస్తున్న మ‌రో 37 వేల షెల్ కంపెనీల‌ను సైతం కేంద్రం గుర్తించింది. వీటిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌టానికి మోడీ స‌ర్కారు రంగం సిద్ధం చేస్తున్నార‌ని చెబుతున్నారు. గుట్టుచ‌ప్పుడు కాకుండా జ‌రిగిపోయిన ఈ వ్య‌వ‌హారం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చి చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News