మోదీ ఇచ్చే నెక్స్ట్ షాక్: 50 ఏళ్ల కే రిటైర్ మెంట్

Update: 2019-09-18 13:25 GMT
పెద్ద నోట్ల రద్దు - జీఎస్టీ వంటి షాకులిచ్చిన ప్రధాని మోదీ త్వరలో మరో షాక్ ఇస్తారని తెలుస్తోంది. ఆయన ఇవ్వబోయే షాక్ ఈసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తగలనుందట. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్ మెంట్ వయసు నిబంధనలను మార్చబోతున్నట్లు సమాచారం. దాని ప్రకారం రిటైర్మెంట్ వయసు ఎప్పటిలానే 60 ఏళ్లు ఉంటుంది.. కానీ, 60 ఏళ్లలోపు 33 ఏళ్ల సర్వీసు పూర్తయితే రిటైరైపోవాలి.అంటే 27 సంవత్సరాల కంటే తక్కువ వయసులో ఉద్యోగాలు వచ్చినవారు 60 ఏళ్ల కంటే ముందే రిటైరైపోతారన్నమాట. ఇంకా చెప్పాలంటే 17 సంవత్సరాలకే ఎవరికైనా ఉద్యోగం వస్తే 50 ఏళ్లకే రిటైరైపోతారు.

ఈ ప్రతిపాదనలో ఐఏఎస్ - ఐపీఎస్ నుంచి కేంద్ర ప్రభుత్వంలోని అన్ని కేటగిరీల ఉద్యోగులకు వర్తిస్తుంది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో చాలా ఉద్యోగాలకు పదవీ విరమణ వయస్సు అరవై ఏళ్లుగా ఉంది. పదవీ విరమణ తగ్గింపు వయస్సు కొత్తదేమీ కాదని కూడా ప్రభుత్వం చెబుతోంది. ఏడో వేతన సంఘంలో కూడా ప్రస్తావించినట్లుగా గుర్తు చేస్తోంది. ఈ ప్రతిపాదనకు సంబంధించి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని - అధికారులు - ఉద్యోగుల జాబితాను అన్ని శాఖలు సిద్ధం చేస్తున్నాయని డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ వర్గాలు చెబుతున్నాయి.  ఈ ప్రతిపాదనను అమలు చేస్తే తొలి ప్రభావం సాయుద దళాలలో చేరే వారిపై పడుతుందని చెబుతున్నారు. ఈ ఉద్యోగంలో చేరడానికి సగటు వయస్సు 22. అంటే వారు 33 ఏళ్లకు రిటైర్ మెంట్ తీసుకోవాలంటే ఇప్పుడున్న అరవై ఏళ్ల పదవీ విరమణ కంటే 5 ఏళ్లు ముందు చేయాల్సి ఉంటుంది.

ఈ ప్రతిపాదన ద్వారా దేశంలోని నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గించడం ద్వారా యువతకు ఉద్యోగాలు లభిస్తాయని యోచిస్తోంది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ సర్వే నివేదిక ప్రకారం దేశంలో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. మోడీ ప్రభుత్వంపై విమర్శలు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అయితే, దేశంలోని వివిధ రాష్ట్రాలు ఉద్యోగులను ఊరడించడానికి పదవీ విరమణ వయసును పెంచుకుంటూ పోతున్నాయి. పశ్చిమబెంగాల్లో కొన్ని ఉద్యోగాలకు రిటైర్ మెంటు ఏకంగా 65 సంవత్సారాలు. అలాంటప్పుడు మోదీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా ధైర్యమైనదేనని చెప్పాలి.


Tags:    

Similar News