# క‌థువా..# ఉన్నావో...ర‌గులుతోన్న భార‌తీయం!

Update: 2018-04-13 13:43 GMT
జ‌మ్ము క‌శ్మీర్ లోని క‌థువాకు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి ఆసిఫా గ్యాంగ్ రేప్ - హ‌త్యోదంతం....ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ఉన్నావాలో ద‌ళిత మైన‌ర్ పై ఎమ్మెల్యే అత్యాచారం ఆరోప‌ణ‌లు...అరెస్టు ఘ‌ట‌న....దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఘ‌ట‌న‌ల‌పై దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌లో తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆసిఫాకు - అత్యాచారానికి గురైన యువ‌తికి మ‌ద్ద‌తుగా సోష‌ల్ మీడియాలో ఓ ఉద్య‌మ‌మే న‌డుస్తోంది. అయితే, అంత‌ర్జాతీయ మీడియాలో చ‌ర్చ‌నీయాంశ‌మైన ఈ రెండు ఘ‌ట‌న‌ల‌పై భార‌త ప్ర‌ధాని నరేంద్ర మోదీ మౌనం వ‌హించ‌డం మ‌రింత చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దేశంలో క‌ల‌క‌లం రేపిన ఈ దారుణోదంతాల‌పై ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌ధాని స్పందించ‌పోవ‌డం ప‌లువురిని విస్మ‌యానికి గురిచేస్తోంది. దేశం న‌లుమూల‌ల‌న నుంచి బీజేపీకి వ్య‌తిరేకంగా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నప్ప‌టికీ....ప్ర‌ధాని మౌనం వెనుక మ‌ర్మం ఏమిట‌ని ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు.

జ‌మ్ము క‌శ్మీర్ లోని క‌థువా గ్రామంలో వెనుక‌బ‌డిన సంచార‌ ముస్లింల తెగ బ‌కెర్వాల్ కు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి ఆసిఫా....ఈ ఏడాది జ‌న‌వరి 10న అదృశ్య‌మైంది. ఆమె అదృశ్య‌మైన వారం ప్రాంతంలోనే ఆసిఫా మృత‌దేహం ల‌భ్య‌మైంది. ఆ చిన్నారిని కిడ్నాప్ చేసి - ఆమెకు మాద‌క ద్ర‌వ్యాలు ఇచ్చి ...ఆమెపై అమానుషంగా సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డ‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఆసిఫాపై ఆరుగురు దుర్మార్గులు గుడిలో అత్యాచారం చేసి...ఆ పై హ‌త్య చేశార‌ని, ఈ వ్య‌వ‌హారంలో ఆ గుడి ప్ర‌ధాన అర్చ‌కుడే ప్ర‌ధాన నిందితుడ‌ని పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో వెల్ల‌డైంది. అయితే, అనూహ్యంగా ఈ కేసులో నిందితులకు మ‌ద్ద‌తుగా జమ్ము కశ్మీర్ న్యాయవాదులు నినాదాలు చేస్తూ ఆందోళనలు చేశారు. నిందితుల‌పై పోలీసులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేయకుండా న్యాయ‌వాదులు అడ్డుకునే ప్రయత్నాలు  చేయ‌డంతో ఈ కేసు జాతీయ‌స్థాయిలో వెలుగులోకి వ‌చ్చింది.

మ‌రోవైపు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ఉన్నావోలో 16 ఏళ్ల ద‌ళిత బాలిక‌పై బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్, ఆయ‌న ఇద్ద‌రు సోద‌రులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆ ఎమ్మెల్యే పై పోలీసులు ఫిర్యాదు న‌మోదు చేయ‌లేదు. సాక్ష్యాత్తూ యూపీ సీఎం యోగికి ఆమె ఫిర్యాదు చేసినా అది బుట్ట‌దాఖలైంది. త‌న కూతురికి జ‌రిగిన అన్యాయంపై ఆమె తండ్రి పోరాడాడు. అయితే, అత‌డిని అక్ర‌మ కేసులో ఇరికించిన పోలీసులు లాక‌ప్ డెత్ చేశారు. దీంతో, ఆ నిస్స‌హాయురాలు సీఎం యోగి నివాసం ముందు ఆత్మాహుతికి ప్రయత్నించింది. ఆ ఘ‌ట‌న‌తో గ్యాంగ్ రేపు వ్య‌వ‌హారం వెలుగులోకి రావ‌డంతో ఎమ్మెల్యే సోదరుడిని అరెస్టు చేశారు. ఈ వ్య‌వ‌హారం ముద‌రడంతో ఈ కేసును సీబీఐకి అప్ప‌గించారు. తాజాగా, ఈ రోజు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. ఈ నేప‌థ్యంలో ఇక‌నైనా ప్ర‌ధాని మోదీ త‌న మౌనాన్ని వీడి ఆ దారుణ ఘ‌ట‌న‌ల‌పై స్పందించాల‌ని దేశ ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్నారు.
Tags:    

Similar News