అలా జరిగాకే మోడీ రిటైర్మెంట్ తీసుకుంటారట!

Update: 2019-09-18 05:39 GMT
ప్రధానమంత్రి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అధికారంలో ఎంత కాలం ఉండే అవకాశం ఉంది?  పార్టీ వరుస విజయాలు సాధించిన వేళలో ప్రధానమంత్రి పదవిని చేపట్టకుండా.. వేరే వారికి అప్పజెప్పేస్తారా? అలా సాధ్యమేనా? ఇంతకీ ఇలాంటి విషయాలు చెప్పిందెవరు? అన్న విషయంలోకి వెళితే.. సీనియర్ పాత్రికేయులు కమ్ పుస్తక రచరత మిన్హాజ్ మర్చంట్ తాజాగా ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

 మోడీ రిటైర్మెంట్ ప్లాన్ గురించి ఆయన మాట్లాడుతూ.. పదకొండేళ్ల తర్వాత మోడీ రిటైర్ అవుతారని.. 2024లో జరిగే ఎన్నికల్లో మోడీ గెలిస్తే ఆయనలో పరివర్తన వస్తుందని.. 2029 ఎన్నికల ముందు ఆయన పక్కకు తప్పుకొని.. హిమాలయాలకు వెళ్లిపోతారని పేర్కొన్నారు. 2029లో సన్యాసిలా మారి తన పదవిని ఇతరులకు ఇచ్చేసి హిమాలయాలకు వెళ్లిపోతారన్నారు.

18 ఏళ్ల వయసులో హిమాలయాలకు వెళ్లిన మోడీ.. మళ్లీ 80 ఏళ్ల వయసులో (అంటే మరో పదకొండేళ్లకు) హిమాలయాలకు వెళ్లి సన్యాసిలా మారిపోతారన్నారు. ఇప్పటివరకూ మోడీ తర్వాతి అడుగు ఎలా ఉంటుందా? అన్నది ఆలోచించినోళ్లే తప్పించి.. పదకొండేళ్ల తర్వాత ఆయనేం చేస్తారు? ఏం చేసే అవకాశం ఉందన్న అంశంపై తొలిసారి మాట్లాడింది మిన్హాజ్ మర్చంట్ అవుతారని చెప్పక తప్పదు.


Tags:    

Similar News