9న మోడీ.. వెంట జగన్.. ఏం వరమో.?

Update: 2019-06-05 10:43 GMT
మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తన తొలి పర్యటనను ఆ దేవదేవుడు తిరుమలేషుడిని దర్శించుకోవడానికే వస్తున్నాడు. 2014లో అధికారంలోకి రాకముందు తిరుమలేషుడిని దర్శించుకొని ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చాడు. అధికారంలోకి వచ్చాక తిరుమలేషుడిని దర్శించుకొని ఆ తర్వాత హోదా ఊసే మరిచాడు. ఇప్పుడు ఐదేళ్లు గడిచాక కూడా మోడీ ఏపీకి హోదా ఇవ్వలేదు.

ఇప్పుడు రెండోసారి అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన మోడీ మొదటిసారి ఏపీకి వస్తున్నాడు. నాడు చంద్రబాబుపై కోపంతో మోడీ హోదా ఇవ్వలేదు. ఇప్పుడు బాబు ఓడాడు. జగన్ సానుకూలంగా ఉన్నాడు. దీంతో తిరుమలకు వస్తున్న మోడీ ఏపీకి ఏదైనా  వరాల మూట విప్పుతాడేమోనని ఏపీ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఈనెల 9న తొలిసారి మోడీ తిరుమల పర్యటనకు వస్తుండడంతో బీజేపీ శ్రేణులు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఘనంగా స్వాగత సత్కారాలకు పూనుకున్నాయి. ఇక ఏపీలోనూ ఘనవిజయం సాధించిన జగన్ ఈనెల 9న మోడీని కలిసేందుకు తిరుపతి వెళ్లనున్నారు. మోడీకి దర్శనం చేయించి సత్కారం చేయనున్నారు. ఈ సందర్భంగానే ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని ప్రధానిని కోరే అవకాశం ఉంది.

ఇక జగన్ ఈనెల 17న ఢిల్లీకి వెళ్లి నీతిఅయోగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. కాగా మోడీ రాక సందర్బంగా టీడీపీ, ప్రజాసంఘాలు, మేధావి సంఘాలు మోడీని ఘెరావ్ చేయాలని నిర్ణయించాయి. తిరుపతి సాక్షిగా 2014లో మోడీ ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా అమలు చేయాలని ఆందోళన చేయాలని వారంతా నిర్ణయించుకున్నారు.

   

Tags:    

Similar News