దత్తపుత్రుడు ఎపిసోడ్ : బీజేపీని కెలికిన నారాయణ

Update: 2022-05-21 12:42 GMT
ఏపీలో దత్తపుత్రుడు ఎపిసోడ్ అలా కంటిన్యూ అవుతోంది. ఇది ఇప్పట్లో ఆగేది మాత్రం కాదు. పవన్ ఫీల్డ్ లోకి వచ్చినపుడల్లా వైసీపీ నుంచి దత్తపుత్రుడు అన్న విమర్శలు వస్తూనే ఉంటాయి. ఇక దానికి కౌంటర్ గా జనసేన నుంచి సీబీఐ దత్తపుత్రుడు జగన్ అని అటాక్ ఉంటుంది. ఇలా ఈ రెండు పార్టీలు ఒకరిని ఒకరు అనుకుంటూ రాజకీయ చెలగాట ఆడుకుంటున్నాయి.

మధ్యలో  సడెన్ గా సీపీఐ జాతీయ కారదర్శి నారాయణ ఎంట్రీ ఇచ్చారు. ఆయన లేటెస్ట్ గా జగన్ ఎవరికి దత్తపుత్రుడో తనదైన రాజకీయ విశ్లేషణతో క్లారిటీగా చెప్పారు. జగన్ సీబీఐ దత్తపుత్రుడు అని లైట్ గానే ఈ రోజుకూ  జనసేన కామెంట్స్ చేస్తోంది. నిజానికి ఈ కామెంట్స్ కి పెద్దగా పవర్ లేదు అనే అంటున్నారు అంతా.

జగన్ సీబీఐ అన్న రెండు మాటలూ క్యాచీగా లేవు. జనాలలోకి కూడా వెళ్ళేలా లేవు. అందుకే సరైన టైమింగ్ తో నారాయణ జగన్ ఎవరికి దత్తపుత్రుడు అన్నది బయట పెట్టారు. జగన్ మోడీకి దత్తపుత్రుడు అని నారాయణ పొలిటికల్ గా సౌండ్ ఇచ్చారు.

దానికి ఆయన చెప్పిన కారణాలు ఏంటంటే మోడీకి సంతానం లేదు కాబట్టి జగన్ని దత్తతకు తీసుకున్నారుట. అదే విధంగా మోడీ కనుసన్నలలోనే జగన్ సర్కార్  నడుస్తున్నారుట. ఒక విధంగా బీజేపీ వైసీపీల మధ్య ఉన్న రహస్య స్నేహ బంధాన్నిదత్తపుత్రుడు అన్న ఒకే ఒక్క  సెటైర్ తో నారాయణ బయటపెట్టారు అనుకోవాలి.

సరే నారాయణ ఈ విధంగా అనడం మీద వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. దీని మీద ఈ సమయంలో మాట్లాడేందుకు టీడీపీ కూడా  ధైర్యం చేయదు. ఆ పార్టీ ఇప్పటికైతే బీజేపీతో సఖ్యతను కోరుకుంటోంది. ఇంకో వైపు చూస్తే జనసేన కూడా మాట్లాడేది ఉండదు, వారు బీజేపీ మిత్రులుగా ఉన్నారు కనుక.

మరి ఎవరు గట్టిగా రియాక్ట్ అవుతారు అనుకుంటే ఏపీ బీజేపీ నేతలే. ఏపీలో బీజేపీ సొంతంగా ఎదగాలని చూస్తోంది. మరి వైసీపీతో లింక్ పెట్టి మీరూ మీరూ ఒక్కటే అని నారాయణ చేసిన ఈ పద ప్రయోగం కచ్చితంగా కాషాయం పార్టీకి కోపం తెప్పించడం ఖాయం. మరి ఇవన్నీ చూస్తే కనుక నారాయణ అటూ ఇటూ తిరిగి ఈ దత్తపుత్రుడు సెటైర్ బీజేపీ మీదకే నేరుగా వేసి కెలికినట్లు అయింది అంటున్నారు.
Tags:    

Similar News