గ్రౌండ్ రిపోర్ట్: నరసరావుపేటలో గెలుపెవరిది?
పార్లమెంట్ నియోజకవర్గం: నరసారావుపేట
టీడీపీ: రాయపాటి సాంబశివరావు
వైసీపీ: లావు శ్రీకృష్ణదేవరాయులు
జనసేన : నయూబ్ కమాల్
రాజకీయం చైతన్యం ఉన్న గుంటూరు జిల్లాలో ఎన్నికల పోరు ఆసక్తికరంగా ఉంటుంది. ఈ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు అగ్రస్థానాలను అధిరోహించిన సందర్భాలున్నాయి. ఇందులో భాగంగా నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన ఎంపీలు కీలక పదవులు అనుభవించారు. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఈ పార్లమెంట్ నియోజకవర్గం ఆ తరువాత టీడీపీ పాగా వేసింది. మారుతున్న సమీకరణాల దృష్ట్యా ఈసారి గెలుపు ఎవరిదోనన్న ఆసక్తి నెలకొంది.
* నరసరావుపేట చరిత్ర
అసెంబ్లీ నియోజకవర్గాలు: నరసరావుపేట - వినుకొండ - చిలకలూరిపేట - సత్తెనపల్లి - పెదకూరపాడు - గురజాల - మాచర్ల
ఓటర్లు: 14 లక్షల 50 వేలు
1952లో నరసరావుపేట లోక్ సభ స్థానానికి మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. మొత్తం 16 సార్లు ఎన్నికలు జరగగా 10 సార్లు కాంగ్రెస్ గెలుపొందింది. నాలుగుసార్లు టీడీపీ - ఒక విడత స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ నియోజకవర్గం ఆదినుంచి కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. 2014లో నరసారావుపేట నుంచి అప్పటి వరకు కాంగ్రెస్ లో ఉన్న రాయపాటి సాంబశివరావు టీడీపీలో చేరి గెలిచారు.
*రాయపాటి సాంబశివరావుకు ఈసారి టఫ్ ఫైట్
రాయపాటి సాంబశివరావుకు ఘనమైన రాజకీయ చరిత్ర ఉంది. ఆయన మొదటిసారిగా 1982లో తొలిసారి రాజ్యసభకు ఎంపీగా వెళ్లారు. తరువాత ఐదుసార్లు లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. గుంటూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున 4 సార్లు - నరసారావుపేట నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున 2014లో ఎంపీగా గెలుపొందారు. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన రాయపాటికి ఇటీవల టీడీపీలో ప్రాధాన్యత లేదనేది ప్రచారం. ఆయన ఎమ్మెల్యేల సహకారం లేనిది ఏ పని చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేలు టీడీపీలో బలమైన నేతలుగా ఉండడంతో వారికి తలొగ్గాల్సి వస్తోందని నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతోంది. రాయపాటికి ఎంపీ టికెట్ ను ఇవ్వవద్దని బాబు నిర్ణయించినా చివరి నిమిషంలో ఒత్తిడికి తలొగ్గి ఇచ్చినట్టు సమాచారం.
* అనుకూలతలు:
-ఆరుసార్లు ఎంపీగా పని చేసిన అనుభవం
-ఆర్థికంగా బలమున్న నేత కావడం
-రాజధానికి సమీపంలో ఉండడంతో అభివృద్ధి పనుల్లో చొరవ
* ప్రతికూలతలు:
-రాయపాటికి సహకరించని ఎమ్మెల్యేలు
-అభివృద్ధి పనులు చేయడంలో నిస్సారం
-ఎంపీ కలవడానికి ఇబ్బందులు తప్పలేదంటున్న నియోజకవర్గ ప్రజలు
* లావు శ్రీకృష్ణదేవరాయులుకు అవకాశం దక్కేనా?
నియోజకవర్గ ఇన్ చార్జులకే టికెట్ అన్న వైసీపీ నేత జగన్.. ఆందులో భాగంగానే నరసరావుపేట సీటును లావు శ్రీకృష్ణ దేవరాయులుకు కేటాయించారు. కాకపోతే ఆయన ఐదేళ్లుగా గుంటూరు నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేశారు. ఇక్కడ మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి టికెట్ కేటాయించడంతో శ్రీకృష్ణదేవరాయులును ఒప్పించి నరసరావుపేటను కేటాయించారు. ఈ నియోజకవర్గంలో ఇటీవల వైసీపీ పుంజుకుంటోంది. ఇందులో భాగంగా ఆయన కార్యకర్తలను పరిచయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. అయితే నాన్ లోకల్ ఫ్యాక్టర్ ఈయనపైనే వ్యతిరేక ప్రభావం చూపుతోంది. కానీ వైసీపీ గాలి ఈయనకు అనుకూలంగా ఉంది. బలమైన రాయపాటిపై ఈయన గెలుపు అవకాశాలు టఫ్ ఫైట్ గా ఉన్నాయి.
*అనుకూలతలు:
-నియోజకవర్గంలో వైసీపీ పుంజుకోవడం
-పార్టీనే నమ్ముకున్న వ్యక్తిగా ప్రజల్లో మంచిపేరు
-యువ నేతగా ప్రచారం చేయడంతో ఆదరణ
*ప్రతికూలతలు:
-ప్రత్యర్థి సీనియర్ నేత కావడం
-టీడీపీ కంచుకోట
-తొలిసారి పోటీ చేస్తుండడం
*జనసేన పోటీ నామమాత్రమే..
జనసేన తరుఫున ఇక్కడ నయీబ్ కమాల్ బరిలో ఉన్నారు. బలమైన కాపు ఓటు బ్యాంకు ఉన్నా ఇక్కడ మైనార్టీ ముస్లిం అభ్యర్థిని జనసేనాని పవన్ బరిలోకి దింపారు. ఆయన గెలుపు కష్టమే.. ఇద్దరు ఉద్దండుల మధ్య ఈయన నిలదొక్కుకోవడం కష్టమేనంటున్నారు.
*టఫ్ ఫైట్.. గెలుపు ఇద్దరికీ చాన్స్
మొదటగా ఆరోగ్యం బాగాలేదని చెప్పిన రాయపాటి సాంబశివరావు ఆ తరువాత బరిలోకి నిలుచున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారంలోకి దూసుకెళ్తున్నారు. అయితే టీడీపీలో వర్గపోరు ఉండడం రాయపాటికి మైనస్‌గా మారనుంది. దీనిని ప్రత్యర్థి అయిన లావు శ్రీకృష్ణదేవరాయులు తన ప్రచారానికి అనుకూలంగా మార్చుకుంటన్నారు. నాన్ లోకల్ అయినా కూడా స్థానిక వైసీపీ నేతలు బలంగా ఉండడంతో ఈయనకు కలిసివస్తోంది. ఒకవేళ అసెంబ్లీ నియోజకవర్గంలోని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు రాయపాటిపై వ్యతిరేకత కొనసాగిస్తే శ్రీకృష్ణదేవరాయులు గెలుపు పెద్ద కష్టమేమీ కాదు. అంతిమంగా ఇద్దరికీ ఇక్కడ గెలుపు అవకాశాలున్నాయి.