హీట్ పుట్టించేలా లోకేశ్ ట్వీట్లు..!
వరుస పెట్టి నిర్ణయాలు తీసుకుంటూ పాలనా రథాల్ని పరుగులు తీయిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేగాన్ని అందుకునేందుకు అపసోపాలు పడుతోంది ఏపీ విపక్షం. దీంతో.. ఏదోలా బురద జల్లే కార్యక్రమానికి తెర తీశారు తెలుగు తమ్ముళ్లు. ఇందులో భాగంగా గతానికి సంబంధించిన కొన్ని అంశాల్నితెర మీదకు తెచ్చి అదే పనిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆరోపణలతో ట్వీట్లు పోస్ట్ చేస్తున్నారు.
తమ హయాంలో అద్భుతాలు జరిగాయన్నట్లుగా గొప్పలు చెప్పే ప్రయత్నం చేసిన లోకేశ్.. తమ ప్రభుత్వ హయాంలో అద్భుతాలు జరిగినట్లుగా గొప్పలు చెప్పుకున్నారు. ఒకవేళ లోకేశ్ చెప్పినట్లుగా అంత అద్భుతాలే జరిగి ఉంటే.. మొన్న జరిగిన ఎన్నికల్లో అంత దారుణంగా చంద్రబాబును ఏపీ ప్రజలు ఎందుకు ఓడించి ఉంటారన్న ప్రశ్నకు సమధానం చెబితే బాగుంటుంది.
ప్రతి పేదకూ సొంతిల్లు ఉండాలన్న ఉద్దేశంతో పేదల కోసం ధనికుల ఇళ్లకు తీసిపోని రీతిలో అత్యాధునిక సౌకర్యాలతో ఇళ్లు కట్టించి ఇచ్చారన్నారు. మూడు విడతల్లో ఎనిమిది లక్షలకు పైగా ఇళ్లను పంపిణీ చేసినట్లుగా పేర్కొన్నారు. తామీ విషయాన్ని గర్వంగా చెప్పుకోలగమన్న లోకేశ్ ఒక ప్రశ్న.. ఇంతచేసిన బాబు.. తన సొంతింటిని అమరావతిలో ఎందుకు నిర్మించుకోనట్లు? కరకట్ట మీద ఉన్న బాబు అద్దె ఇల్లు ఈ మధ్యనే అక్రమమని తేల్చి నోటీసులు ఇవ్వటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. జగన్ ను ఉద్దేశించి నారా లోకేశ్ చేసిన వరుస ట్వీట్లు చూస్తే..
+ కానీ మీరు మీ తండ్రి పాలనలో కట్టిన ఇందిరమ్మ ఇళ్ళ వంటి నాసిరకమైన ఇళ్ళలోనే పేదలు ఉండాలని భావిస్తున్నారు. టెక్నాలజీ ప్రయోజనాలు పేదలకు అనవసరమని మీరు అనుకుంటున్నట్టు ఉన్నారు.
+ ప్రతి పేదకూ సొంత ఆస్తి ఇవ్వాలన్న ఆలోచనతో @ncbn గారు పేదల కోసం ధనవంతుల ఇళ్ళకు తీసిపోని అత్యాధునిక సౌకర్యాలతో ఇళ్ళు కట్టించి ఇచ్చారు. మూడు విడతల్లో 8,00,346 ఇళ్ళు పంపిణీ చేశారు. ఇది మేము గర్వంగా చెప్పుకోగలం.
+ 2014కు ముందు రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టేందుకు రూ.11 వేల కోట్లు కేటాయించి, అందులో రూ.7,759 కోట్లు మాత్రమే ఖర్చు చేసారు. అందులోనూ లబ్దిదారులకు రూ.3,500 కోట్లు ఖర్చుపెట్టి మిగతా రూ.4150 కోట్లు దోపిడీ చేశారు. పేదల ఇళ్ళ నిర్మాణంలో అవినీతికి పరాకాష్ట అది.
+ .@ysjagan గారూ! ఆ రోజుల్లో మీరు క్విడ్ ప్రో కోలో బిజీ కాబట్టి మీకు ఇందిరమ్మ ఇళ్ళ అవకతవకల గురించి అవగాహన ఉండకపోవచ్చు. ఈనాటి సమీక్షలో మీతో పాటు కూర్చున్న బొత్స సత్యనారాయణగారిని అడిగుంటే, 14 లక్షల ఇళ్లను కట్టకుండానే బిల్లులు తీసుకున్న అవినీతి గురించి వివరించేవారు.