సీఎం జగన్ గారి టింగ్లీష్..దిస్ ఈజ్ వాస్తవం!
ప్రస్తుతం ఏపీలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. టీడీపీ నేతలు - వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ కార్యదర్శి లోకేశ్ తదితరులపై మంత్రులు - ఎమ్మెల్యేలు.. తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ సభా మర్యాదలను ఉల్లంఘిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు దేశం నేతలు కూడా తమదైన శైలిలో వైసీపీ నేతలకు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం జగన్ పై ఎమ్మెల్సీ నారా లోకేష్ సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు.
తాజాగా టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ ఓ ట్వీట్ చేశారు. సీఎం జగన్ ఇంగ్లీష్ ఎలా ఉంటుందో చూడంటూ వీడియోను పోస్ట్ చేశారు. సీఎం అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘‘అధ్యక్షా.. రాజధాని మార్పు కోసం ఏ బిల్లు అవసరం లేదు.. ఏ తీర్మానం అవసరం లేదు. ఎక్కడి నుంచైనా పరిపాలన చేయొచ్చు. రాజ్యాంగంలో రాజధాని అనే మాట ఎక్కడా లేదు. ఇది వాస్తవం.. దిస్ ఈజ్ వాస్తవం!’’ అన్నారు. దీనికి సంబంధించిన క్లిప్‌ను జత చేస్తూ.. లోకేష్ తన అధికారిక ట్వీట్టర్ లో.. సీఎం జగన్ తెలుగు - ఇంగ్లీష్ భాషల్ని కలిపి వాడటంపై.. జగన్ గారి టింగ్లీష్ అంటూ.. సీఎం పై వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.