జగన్ మీద చినబాబు పంచ్ ఏసేశారండోయ్

Update: 2016-04-28 10:09 GMT
ఏపీ సర్కారు అనుసరిస్తున్న వైఖరి మీద దేశ రాజధానిలో సేవ్ ద డెమోక్రసీ పేరుతో ఏపీ విపక్ష నేత జగన్ చేపట్టిన కార్యక్రమంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే స్పందించటం తెలిసిందే. బాబు మాటలు  జగన్ చేసిన ఆరోపణలకు వివరణ ఇచ్చినట్లుగా కనిపిస్తే.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మాటలు అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. జగన్ ఢిల్లీ పర్యటనపై చినబాబు వేసిన పంచ్ ల్లో చురుకుదనం కనిపిస్తోంది.

ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు కొందరు చెప్పిన మాటనే లోకేశ్ చెబుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త్వరలో ఖాళీ అవుతుందని తేల్చేశారు. జగన్ అహంకారం కారణంగా ఆ పార్టీలో ఎవరూ మిగలటం లేదన్న లోకేశ్.. ఆ పార్టీలో ఎవరూ మిగలరన్నారు. జగన్ అత్యంత అసమర్థ ప్రతిపక్ష నేతగా అభివర్ణించారు.

తమ ఎమ్మెల్యేల్ని అధికారపార్టీలోకి ఆహ్వానించేందుకు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేస్తున్నట్లుగా జగన్ ఆరోపించటం తెలిసిందే. ఒక్కో ఎమ్మెల్యేకురూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా జగన్ ఆరోపించటం తెలిసేందే. జగన్ చేసిన ఆరోపణల్ని లోకేశ్ తిప్పి కొట్టిన వైనం ఆసక్తికరంగా ఉండటమే కాదు.. కన్వీన్స్ చేసేలా ఉండటం గమనార్హం.

తమకు డబ్బు మీద వ్యామోహం లేదన్న లోకేశ్.. తాను పుట్టే సమయానికే తన తాత ముఖ్యమంత్రిగా ఉన్నారని.. ఆ తర్వాత తన తండ్రి రెండుసార్లు సీఎంగా పని చేశారని.. అప్పుడు లేని డబ్బు మీద వ్యామోహం ఇప్పుడు ఎక్కడ నుంచి వస్తుందని ప్రశ్నించారు. దిక్కుతోచని పరిస్థితుల్లోనే జగన్ ఢిల్లీ పర్యటన చేస్తున్నట్లుగా ఎద్దేవా చేశారు. ఫర్లేదు.. చినబాబుకు కూడా ఏసుకుంటున్నారే.
Tags:    

Similar News