గుమ్మడికాయ ఎత్తుకుపోయింది ఎవరంటే భుజాలు తడుముకుంటున్న లోకేష్!?
ఏపీ ఫైబర్ గ్రిడ్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని వైసీపీ సోషల్ మీడియా విభాగం ఆరోపిస్తోంది. చంద్రబాబు హయాంలో ఐటీశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ నే వేలెత్తిచూపిస్తోంది. అందులోని అవినీతిపై వైసీపీ ప్రభుత్వం కూడా విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా లోకేష్ ను ఎవరూ అడగకపోయినా ఎందుకు తాజాగా ఫైబర్ గ్రిడ్ గురించి మాట్లాడుతుండడం అనుమానాలకు తావిస్తోంది. లోకేష్ పరిస్తితి చూస్తుంటే గుమ్మడికాయ ఎత్తుకుపోయింది ఎవరంటే భుజాలు తముకుంటున్నట్టు అనిపిస్తోందని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
తాజాగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టెక్కలిలో పర్యటించారు. ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడి కుటుంబ సభ్యులను నిమ్మాడలో పరామర్శించాడు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న టీడీపీ నేతలను జైలుకు పంపుతున్నారని.. న్యాయపోరాటం చేసి టీడీపీ నేతలు, కార్యకర్తలకు అండగా ఉంటామని అన్నారు. అదే క్రమంలో ‘ఫైబర్ గ్రిడ్ కు.. ఐటీ మంత్రికి సంబంధం లేదు’ అని హాట్ కామెంట్ చేశారు.
నిజానికి ఫైబర్ గ్రిడ్ గురించి లోకేష్ ను ఏ విలేకరి ప్రశ్న అడగలేదు. పరామర్శకు వచ్చిన లోకేష్ యథాలాపంగా ఆ మాట అన్నాడు. దీన్నిబట్టి గత ప్రభుత్వ హయాంలో ఫైబర్ గ్రిడ్ లో ఏదో అవినీతి జరిగి ఉంటుందన్న అనుమానాలకు బలం చేకూరుతోందని.. అందుకే లోకేష్ భయపడి తనకు సంబంధం లేదని తప్పించుకుంటున్నాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
నిజంగా అందులో అవినీతి జరగకపోతే.. భయం లేకపోతే లోకేష్ ఎందుకు గుమ్మడికాయ దొంగల ‘ఫైబర్ గ్రిడ్’పై శ్రీకాకుళం పర్యటనలో ప్రస్తావిస్తాడని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. లోకేష్ భయాన్ని బట్టి చూస్తే ఫైబర్ గ్రిడ్ లో బుక్ అవ్వడం ఖాయం అని వైసీపీ నేతలు అంటున్నారు. మరి దీని విచారణలో ఏం తేలుతుందో చూడాలి.