బైకు ర్యాలీ అయితే హెల్మెట్ వద్దా లోకేశా?

Update: 2020-01-17 12:10 GMT
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలన్న డిమాండ్ తో గడిచిన కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు.. నిరసనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాజధాని మీద ఏపీ ప్రభుత్వం ఇంతవరకూ నిర్ణయం తీసుకోకున్నా.. ఏదో జరిగిపోతుందన్న ఆందోళనతో నిర్వహిస్తున్న నిరసనలు అంతకంతకూ రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. తాజాగా నిర్వహించిన నిరసన ర్యాలీలో ఈ రంగులు మరింత క్లియర్ గా కనిపించిన పరిస్థితి.

అమరావతి రైతులకు మద్దుతుగా గుంటూరు జిల్లా మంగళగిరిలో భారీ బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలో సీపీఐ అగ్రనేతల్లో ఒకరైన నారాయణ.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తదితరులు బైకు ర్యాలీని చేపట్టారు. ర్యాలీ సందర్భంగా వాహనాల మీద ర్యాలీ నిర్వహించిన వేళ లోకేశ్ నడిపిన రాయల్ ఎన్ ఫీల్డ్ వెనుక సీపీఐ నారాయణ కూర్చోవటం అందరిని ఆకర్షించింది.

ఇదంతా ఓకే కానీ.. ఇలా బైకుల మీద ర్యాలీని నిర్వహించే వేళలో చట్టాన్ని పాటించాలన్న ఆలోచన లేకపోవటం ఏమిటి? బైకును నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలన్న ఆలోచన లోకేశ్ కు లేదు సరే.. వెనక కూర్చున్న నారాయణ లాంటి పెద్ద మనిషి అయినా చెప్పాలి కదా? ఇలాంటివి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నట్లు లోకేశా? మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. లోకేశ్ నిర్వహించిన బైక్ ర్యాలీ సందర్భంగా చినబాబు మెడలో పూలమాల వేస్తే.. కనీసం దానిని తీయకుండా అలానేబైకు నడిపిన తీరును చూస్తే.. లోకేశ్ మార్క్ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News