రాబోయే ఎన్నికల్లో బాలయ్య-పవన్ మధ్యే పోటీ!
ఏపీలో రాజకీయం కొత్త మలుపులు తిరిగేటట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కారణంగా రాజకీయం రసకందాయంలో పడనుందని అంటున్నారు. తాజాగా పవన్ చేసిన ప్రకటనే ఇందుకు కారణంగా మారుతోందని చెప్తున్నారు. తాజాగా జనసేన కార్యకర్తలతో సమావేశమైన పవన్ కల్యాణ్ రాబోయే ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో అనంతలో టీడీపీ ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబునాయుడు బావమరిది నందమూరి బాలయ్యకు రాబోయే ఎన్నికల్లో పోటీ పవన్ కళ్యాణ్ అవుతారని పలువురు విశ్లేషిస్తున్నారు.
బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఇటీవల ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్న సంగతి తెలిసిందే. పీఏ కారణంగా తెలుగుదేశం శ్రేణుల్లో, సమస్యలు పరిష్కరించని కారణంగా ప్రజల్లో బాలయ్య బాబుపై ఆగ్రహం పెల్లుబుకుతోందనేందుకు ఇటీవల జరిగిన నిరసన ప్రదర్శనలే నిదర్శనం. ఈ నేపథ్యంలో అనంత నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని చెప్పిన పవన్ ....తన ఎంట్రీకి ఈ జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి రంగంలోకి దిగడంతో ఆ ప్రభావం జిల్లా వ్యాప్తంగా ఉండనుందని అంటున్నారు. తద్వారా అనంతలో అధికార పార్టీలో కీలకంగా ఉన్న బాలయ్యకు గట్టిపోటీ ఇవ్వనున్నట్లు చెప్తున్నారు.
మరోవైపు బాలయ్య రాజకీయ భవిష్యత్‌పై సైతం కొత్త టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చునని అంటున్నారు. ఎమ్మెల్సీగా పెద్దల సభలోకి వెళ్లనున్నారని చెప్తున్నారు.