భారతీయ నల్లకుబేరుల బహుమాస్!

Update: 2016-09-23 04:19 GMT
బా..గా.. డబ్బున్నవారు - బడా బడా గ్రూపుల వారు విదేశాల్లో పెట్టిన కంపెనీల వివరాలను వెల్లడిస్తూ పనామా పత్రాల పేరిట వివరాలు వెల్లడించిన ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే)... తాజాగా బహమాస్ పత్రాలను బయటపెట్టింది. పనామా లీక్స్ తరహాలోనే ఈ బహుమాస్ లీక్స్ కూడా సంచలనం సృష్టిస్తున్నాయి. బహుమాస్ లో కంపెనీలు ఏర్పాటు చేసిన పలు అంతర్జాతీయ గ్రూపులు - భారతీయ సంస్థలు - వ్యక్తుల పేర్లను తాజాగా వెల్లడించింది. ఈ వివరాల్లో వేదాంతా గ్రూపు అధిపతి అనిల్ అగర్వాల్ - ఫ్యాషన్ టీవీ ఇండియా ప్రమోటరు అమన్ గుప్తా - బారన్ గ్రూపు అధిపతి కబీర్ మూల్‌ చందానీ మొదలైన వారు ఉండటం గమనార్హం.

ప్రపంచ వ్యాప్తంగా లక్షా 75 వేల మంది ఇందులో ఈ వ్యవహారంలో ఉన్నట్లు ఐసీఐజే చెబుతుంది. వీరంతా బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునే అవకాశం ఉంది! మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈ నల్లకుబేరుల జాబితాలో సుమారు 475 మంది భారతీయులు ఉన్నట్లు అధికారులు నిగ్గుతేల్చారు. ఈ వ్యవహారంలో సంజీవ్ కపూర్ - జితేంద్ర పాత్రా - రఫిక్ ముల్తానీ పేర్లతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖుల పేర్లు కూడా ఉండటం గమనార్హం. ఈ తాజా బహుమాస్ జాబితాలో నిమ్మగడ్డ ప్రసాద్‌ - నిమ్మగడ్డ ప్రకాష్‌ కూడా ఉన్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్‌ కు చెందిన పలు కంపెనీలు సైతం ఈ జాబితాలో ఉన్నాయి. పన్నురహిత దేశంగా పేరుపొందిన ఈ బహమాస్‌‌‌ లో ఈ భారతీయులంతా సూట్ కేసు కంపెనీలు పెట్టారు!!

అట్లాంటిక్‌ మహా సముద్రంలోని ఒక చిన్న దేశం అయిన ఈ బహుమాస్ - పన్నురహిత దేశంగా పేరుపొందింది. దీంతో ఈ దేశంలో భారతీయులు సూట్ కేసు కంపెనీలు పెట్టారని తెలుస్తోంది. ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖుల్లో కొందరు సికింద్రాబాద్‌ లోని ఒకే అడ్రస్ నుంచి సుమారు 20 సంస్థలున్నట్లు "బహమాస్" లీక్స్ తాజాగా బయటపెట్టింది.

తాజాగా విడుదలైన జాబితాలో ఉన్న ప్రముఖుల్ని చూస్తే..

= నిమ్మగడ్డ ప్రసాద్

= వేదాంత గ్రూపు ఛైర్మన్ అనిల్ అగర్వాల్

= బారన్ గ్రూప్ అధినేత కబీర్ మూల్ చందానీ

= ఫ్యాషన్ టీవీ ఇండియా ప్రమోటర్ రాజన్ మధు

= ప్రీమియం ఫిన్నిష్ వాటర్ బ్రాండ్ ఛైర్మన్ అమన్ గుప్తా

= గుర్జీత థిల్లాన్

= హర్ బజన్ కౌర్

= మైరా డిలోరస్ రెగో

= అశోక్ చావ్లా తదితరులు
Tags:    

Similar News