• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నీలాంటి కుక్కలను చాలా...

నీలాంటి కుక్కలను చాలా మందిని చూశా...మంత్రి జగదీశ్‌ ఆగ్రహం !

By - Tupaki Desk
Update: 2021-04-14 06:34 GMT
నాగార్జునసాగర్ ఉపఎన్నిక రణరంగాన్ని తలపిస్తుంది. విజయం కోసం అన్ని పార్టీలు కూడా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నాయి. టిఆర్ ఎస్ విజయం కోసం అన్ని ప్రణాళికలు రచిస్తుంది. ఇక కాంగ్రెస్, బీజేపీ కూడా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పై ప్రత్యేక దృష్టి  పెట్టాయి. ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడే కొద్ది ప్రచారంలో అన్ని పార్టీల నేతలు కూడా జోరు చూపిస్తున్నారు. ఇక ఈ  ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంగళవారం మంత్రి జగదీశ్ రెడ్డి నియోజకవర్గం లో ప్రచారం నిర్వహించారు. ఈ సమయంలో మంత్రి జగదీశ్ రెడ్డి కి నిరసన సెగ తగిలింది. అయన ప్రచారం చేస్తున్న సమయంలో మంత్రికి వ్యతిరేకంగా కొంత మంది నిరసన వ్యక్తం చేశారు. అనుముల మండలం కొత్తపల్లిలో ఓ ప్రైవేట్ టీచర్ నిరుద్యోగ భృతి, ఉద్యోగాలపై మంత్రిని నిలదీశారు.

వివరాల్లోకి వెళ్తే .. నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా అనుముల మండలం కొత్తపల్లిలో మంగళవారం మంత్రి మాట్లాడుతుండగా ప్రచార  వాహనం వద్దకు అదే గ్రామానికి చెందిన నిరుద్యోగి అలుగుల అశోక్‌ రెడ్డి వచ్చి ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగభృతి హామీ ఏమైందని మంత్రిని ప్రశ్నించారు. దీనితో ఆగ్రహించిన మంత్రి నీలాంటి కుక్కలను చాలా మందిని చూశానని,కఠినంగా వ్యవహరిస్తామని ఫైర్ అయ్యారు. నిన్ను, నీ నాయకుణ్ని తొక్కిపడేస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీలాంటి వారిని చాలా మందిని చూశా.. నిన్ను ఎవరు పంపించారో తెలుసు. నీతో పాటు మీ నాయకులపై కూడా మేం కఠినంగా వ్యవహరిస్తాం’ అంటూ హెచ్చరించారు.  దీనితో పోలీసులు అతన్ని అక్కడి నుండి పంపించివేశారు. ఆ తర్వాత మంత్రి ప్రచారం కొనసాగింది. ఇక  ఎమ్మెస్సీ చేసిన అశోక్‌ రెడ్డి ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేశాడు. లాక్‌ డౌన్‌ తర్వాత ఇంటికి వచ్చి పొలం పనులు చూసుకుంటున్నాడు.
Tags:    
  • Nagarjuna Sagar By Polls 
  • Bjp 
  • trs 
  • Congress 
  • Telangana 
  • Kcr 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS