నా తమ్మడు పరుశరాముడు..ఆ రోజు తప్పక వస్తుంది..: నాగబాబు హాట్ కామెంట్స్

Update: 2022-01-30 07:50 GMT
'రాజకీయాల్లోకి రాగానే ఏ వ్యక్తి ముఖ్యమంత్రి అయిపోడు.. చాలా రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.. ఎందరో మహా నాయకులు అలా కొన్నాళ్లు గడిపిన తరువాతే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు.. పవన్ కల్యాణ్ కూడా తప్పకుండా ఆ పోజిషన్ కు వస్తాడు.. పార్టీ పెట్టగానే సీఎం కావాలనే ఉద్దేశం పవన్ కు లేదు.. అలాగే పవన్ ను చూస్తే పరుశరాముడు గుర్తుకు వస్తాడు..'అని ప్రముఖ సినీ నటుడు, నిర్మాత నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పవన్ పై వస్తున్న కొన్ని కామెంట్లను బేస్ చేసుకొని నాగబాబు ఓ టీవీ ఛానెల్ లో మాట్లాడారు. పవన్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఆసక్తని రేపుతున్నాయి.

'పవన్ పై కొందరు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పవన్ రాజకీయాల్లో ఫెయిల్ అయ్యాడా..? సక్సెస్ అయ్యాడా..? అనేది ఇప్పుడు చెప్పలేం. దాని కోసం చాలా శ్రమతో పాటు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం పవన్ చేస్తున్న పార్టీ కార్యక్రమాలు, ప్రజల కోసం చేస్తున్న పనులు ఏదో ఒక రోజు పోలిటికల్ గా సక్సెస్ నిస్తాయి. పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ 20 సంవత్సరాలు ఓ రాజకీయ పార్టీలో వెయిట్ చేశారు. చివరికి ప్రధానమంత్రి అయ్యారు.'

'అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి రాగానే సీఎం కాలేదు. 15 నుంచి 20 ఏళ్ల పాటు కాంగ్రెస్లో ఉండి ఎన్నో పదవుల్లో కొనసాగారు. చివరికి సీఎం అయ్యారు. ఇక చంద్రబాబునాయుడు గారు కూడా ఎమ్మెల్యేగా.. ఇతర పదవుల్లో కొనసాగారు. దాదాపు చాలా మంది రాజకీయ నాయకులు పార్టీలోకి రాగానే ఓవర్ నైట్ సీఎం కాలేదు. అందువల్ల కొన్ని రోజులు పాటు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పవన్ కూడా ఇలా పార్టీ పెట్టి అలా సీఎం కావాలన్న ఉద్దేశం తనకూ లేదు. పార్టీని స్ట్రాంగ్ గా ఏర్పాటు చేసి ప్రజల్లో మంచిపేరు తెచ్చుకోవాలనే అతని తపన. అలాంటప్పుడు కొంత సమయం పట్టొచ్చు'అని నాగబాబు అన్నారు.

'ఇక కొందరు పవన్ పై చేసే వ్యాఖ్యలకు పవన్ బెదరిపోడు. రాజకీయాల్లో ఒకసారి ఓడిపోతే మళ్లీ ప్రయత్నించకపోతే అతడు జీవితంలోనే ఓడిపోయినట్లు లెక్క. కానీ పవన్ తిరిగి ప్రయత్నిస్తున్నాడు. జనాల కోసం పోరాడుతున్నాడు. ఇలా ప్రయత్నిస్తున్న సమయంలో ఏదో ఒక రోజు తప్పక వస్తుంది. ఆరోజులో అధికారం కూడా చేతిలోకి వస్తుంది. అలా అధికారంలోకి వచ్చినప్పుడు తాను అనుకున్న పనులు చేయగలుగుతాడు. అప్పటి దాకా నోటికొచ్చినట్లు మాట్లాడినోళ్లకు సరైన సమాధానం చెబుతాడు. కళ్యాణ్ బాబును చూస్తే పరుశరాముడు గుర్తుకొస్తాడు. దేనికి అంత తేలిగ్గా లొంగిపోడు. ఎవరికి ఎక్కడెక్కడ ఏం చేయాలి..?అనేది అతనికి బాగా తెలుసు. వాడు కచ్చితంగా ఏపీలో ఒక రూల్ తీసుకొస్తాడు. 'అని నాగబాబు  అన్నారు.

Full View
Tags:    

Similar News