• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సందీప్ కేసు లో వీడిన...

సందీప్ కేసు లో వీడిన మిస్టరీ ..ఆత్మహత్య కి అదే కారణం ..!

By - Tupaki Desk
Update: 2019-11-12 11:29 GMT
మరికొద్ది గంటల్లో పెళ్లి కొడుకు గా పెళ్లి కూతురు మేడ లో తాళిని కట్టాల్సిన వాడు .. బట్టలు మార్చు కోవడానికి అని వెళ్లి పెళ్లి మండపం లోని ఫ్యాన్ కి ఉరి వేసుకొని చని పోయిన విషయం అందరికి తెలిసిందే. ఈ ఘటన కొంపల్లి లో జరిగింది. దిల్‌సుఖ్‌ నగర్‌ లక్ష్మీ నగర్‌ లో నివసిస్తున్న శ్రీనివాస చారి, పద్మజా రాణి ఏకైక కుమారుడు సందీప్‌. తన ఎనిమిదేళ్ల వయసు లో తల్లిని కోల్పోయాడు. తండ్రి రెండోపెళ్లి చేసుకోవడం తో . తాతయ్య , అమ్మమ్మ వారి దగ్గరే పెరిగాడు. సాధించాలనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయాలని, జీవితం లో నిలదొక్కు కోవాలని కలలు కన్నాడు. అనివార్య కారణాల వల్ల పెద్దల మాటలని కాదన లేక పెళ్ళి కి ఒప్పుకున్నాడు.

నిశ్చయ తాంబూలాల కార్యక్రమం జరిగిన కొద్ది రోజుల్లోనే తనను ఎంతో ఇష్టంగా పెంచి, పెద్ద చేసిన తాతయ్య అకాల మరణం చెందాడు. తాత మృతి అతడిని కలిచి వేసింది. కొన్ని రోజులు మానసిక వేదన ను అనుభవించాడు. ఇంత లోనే పెళ్లి అనడం తో ప్రతి చిన్న విషయానికి ఆవేశం, కోపం ప్రదర్శించే వాడు. తల్లి చనిపోయిన ఇంట్లో పెళ్లి కొడుకుగా తయారు కాలేనని అనేవాడు. వేరే ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడే ఉండేవాడు. ఆ ఇంట్లో కూడా తండ్రి తో పెళ్లి విషయం లో వాదనకు దిగే వాడని తెలిసింది. పెళ్లి అనుకున్న దగ్గర నుంచి సందీప్‌ కు నచ్చని సంఘటనలు చోటు చేసుకోవడం, ఇష్టం లేని పనులు చేయాల్సి రావడం, తనకు ఎవరూ లేరనే బాధ, ఒంటరితనం అతడిని కుంగ దీసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమం లోనే పెళ్లి కి పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. పెళ్లి మండపం లో దుస్తులు మార్చు కోవడానికి గది లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. తన మనసును అర్థం చేసుకునే వారు లేరని బాధ, తల్లి, తాతయ్య జ్ఞాపకాలు, ఒంటరితనంతో మానసిక సంఘర్షణ కు లోనై బలవంతం గా ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసుల విచారణ లో తేలినట్లు తెలుస్తోంది. ఆ రూమ్ లోకి వెళ్ళినప్పుడు తనతో పాటు ఎవరైనా వెళ్లింటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు.  సందీప్‌ తండ్రిని పెద్ద మనిషి లా, వార్డెన్‌ లాగే చూసే వాడని తెలిసిన వ్యక్తులు తెలుపుతున్నారు.


Tags:    
  • Hyderabad 
  • Sandeep 
  • Marriage 
  • Telangana News 
  • Marraige sandeep 
  • Telugu News 
  • Telangana Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

మల్లారెడ్డి కోడలు.. మాట మార్చింది..

2026-11-13 07:17 GMT

'నమస్తే వరల్డ్'తో మంచు మనోజ్, భూమా మౌనిక దంపతుల కొత్త ప్రయాణం!

2026-11-13 07:06 GMT

రూ.10 లక్షల నుంచి రూ.18 కోట్లకు.. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా?

2026-11-13 06:53 GMT

మైక్రోసాఫ్ట్ సేవల్లో భారీ అంతరాయం.. ఔట్‌లుక్, టీమ్స్, కోపైలట్ యూజర్లకు ఇబ్బందులు!

2026-11-13 06:51 GMT

కూటమిపై చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు.. స్థానికంలో వైసీపీ గెలుపుపై సీఎం కీలక వ్యాఖ్యలు!

2026-11-13 06:51 GMT

రూ.130 కోట్లకు అమ్ముడైన గోల్కొండ వజ్రం.. 70 ఏళ్ల తర్వాత సంచలనం!

2026-11-13 04:43 GMT

విజయ్ మామ గిఫ్ట్.. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్! దళపతి మాస్టర్ మైండ్ ఇదేనా?

2026-11-13 04:43 GMT

ముచ్చటగా మూడో ఎఫైర్ బయటకు.. ఎన్విడియో 'హువాంగ్' ఏంటయ్యా ఈ యవ్వారాలు..

2026-11-13 04:11 GMT

మీ తాత మా తాత గ్రేట్...లోకేష్ తో ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

2026-11-13 04:06 GMT

డీలిమిటేషన్ బిల్లు ఆమోదం....బీజేపీ ధీమా వెనక ?

2026-11-13 04:02 GMT

సోనియా ఆత్మ కధ....కాంగ్రెస్ కి ఎంత మేలు చేస్తుంది ?

2026-11-13 04:02 GMT

కొత్త పార్టీలు...వారికి అదో తుత్తి !

2026-11-13 04:01 GMT

Copyright @2026

Powered by Blink CMS