దేవాదుల మీటింగ్: రచ్చరచ్చ.. చెలరేగిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

Update: 2020-11-06 16:50 GMT
మంత్రి వారించినా ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినలేదు. ఉన్నతాధికారులు కల్పించుకున్నా తగ్గలేదు. దేవాదుల మీటింగ్ లో రెచ్చిపోయారు. అధికారులపై ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ తంతు వరంగల్ జిల్లా హన్మకొండ హరిత కాకతీయ హోటల్ లో దేవాదుల ఎత్తిపోతల పథకంపై రివ్యూ సమావేశంలో చోటుచేసుకుంది.

ఈ రివ్యూకు వరంగల్ మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ రివ్యూలో అధికారులపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే మంత్రి దయాకర్ రావు ఎంత వారించినా వినకుండా అధికారులపై గులాబీ ఎమ్మెల్యే చిందులు తొక్కడం గమనార్హం. కలెక్టర్ దేవాదుల నీళ్ల కోసం ప్రణాళికలు రచిస్తుంటే అధికారులు సహకరించడం లేదంటూ కన్నెర్ర జేశారు.

దేవాదుల ప్రాజెక్ట్ ఎస్ఈ కనీసం పట్టించుకోకుండా సమస్యను జఠిలం చేస్తున్నారని ముత్తిరెడ్డి ఆరోపించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డిలు ఆందోళన చేస్తున్నారని.. అధికారుల వల్ల ఎమ్మెల్యేల మధ్య గొడవలు అవుతున్నాయన్నారు.

ముత్తిరెడ్డి రెచ్చిపోవడంపై ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎంకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. ముత్తిరెడ్డి ఇప్పటికే పలు వివాదాలతో వార్తల్లో నిలిచారు. తాజా వ్యవహారం ఎంత వరకు వెళ్తుందో చూడాలి.
Tags:    

Similar News