సచివాలయం - రాజ్‌ భవన్ ల మార్పుకు ముహూర్తం ఫిక్స్..

Update: 2020-01-20 16:16 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని తరలింపు అంశం హాట్ టాపిక్ అయింది. పరిపాలన - అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ శాఖకు
రాష్ట్ర ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు విశాఖ వెళ్లి.. అక్కడ ఉద్యోగులకు అవసరమైన సాంకేతికపరమైన అంశాలను పర్యవేక్షించాలని కోరింది. మిలీనియం టవర్‌ - మిగతా భవనాలకు సంబంధించి కేబుల్స్‌ - సాఫ్ట్‌ వేర్‌ - ఆన్‌ లైన్‌ సౌకర్యం తాలూకు వ్యవహారాలపై వెంటనే దృష్టి సారించాలని ఆదేశించింది. సచివాలయం - హెచ్‌ వోడీ కార్యాలయం పనులు వేగవంతం చేయాలని తెలిపింది. విశాఖకు ఉద్యోగులు వచ్చిన వెంటనే పని చేసే విధంగా సౌకర్యాలు కల్పించాలని సూచించింది. ప్లగ్‌ అండ్‌ ప్లేగా ఉండాలని - ఉగాది తర్వాత నుంచి తరలింపు ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు షెడ్యూల్‌ ఖరారు చేసే పనిలో పడ్డారు. ఏప్రిల్‌ 16వ తేదీ నాటికి తరలింపు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రాథమికంగా  ఆయా హెచ్‌వోడీ కార్యానిర్ణయానికి వచ్చారు. మార్చి 25వ తేదీ లోపే కీలక శాఖలకు చెందిన కొంతమంది ఉద్యోగులను ఆన్‌ డ్యూటీ పద్ధతిలో విశాఖకు పంపించాలని  ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు సీఎంవో కార్యాలయాన్ని కూడా వెంటనే తరలించాలని భావిస్తున్నారు.
 
Tags:    

Similar News