క్షమించండి: కాపు నేతలకు ముద్రగడ లేఖ

Update: 2020-09-21 15:00 GMT
ఏపీలో రెండు ప్రధాన సామాజికవర్గాలకు పోటీగా ఉన్నది కాపులే. రెడ్లు, కమ్మలకు ధీటుగా జనాభా పరంగా ఏపీలో మెజార్టీగా ఉన్నా.. రాజకీయ అధికార సాధన మాత్రం వీరితో కావడం లేదు.

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను తాజాగా రాష్ట్ర కాపు జేఏసీ సభ్యులు కలిశారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ నివాసంలో సమావేశమయ్యారు. 13 జిల్లాల నుంచి వెళ్లిన కాపు జేఏసీ నాయకులు ముద్రగడను కలిసి తిరిగి కాపు ఉద్యమ బాధ్యతలను చేపట్టాలని ఉద్యమానికి దూరం కావొద్దని కోరారు.

కానీ కాపు నేతల ప్రతిపాదనకు ముద్రగడ నిరాకరించారు. కాపు నేతలకు ఒక లేఖ రాసి వారికి ఇచ్చారు. మీ కోరిక గౌరవించనందుకు క్షమించమని కోరుతున్నా.. వ్యక్తిగతంగా నేను మీతోనే ఉంటాను. మీ అందరి అభిమానం.. ప్రేమ మరువలేనిది. నా ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా నేనే స్వయంగా జిల్లాలకు వచ్చి ఓపిక ఉన్నంత వరకు ఆహ్వానిస్తాను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టవద్దని’ ముద్రగడ ఆ లేఖలో కాపు నేతలను కోరారు.

కొద్దిరోజుల క్రితమే రాజకీయ ఆరోపణలు రావడంతో ముద్రగడ కాపు ఉద్యమ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే కాపు జేఏసీ నేతలు మాత్రం పద్మనాభంను కలిసి మళ్లీ బాధ్యతలు స్వీకరించాలని కోరారు. ఆయన తిరస్కరించడంతో ఇప్పుడు ఎవరు చేపడుతారనేది ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News