ఏపీలో మోగిన మరో ఎన్నికల నగారా

Update: 2021-04-02 04:10 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో పెండింగ్‌ లో ఉన్న ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలను పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.  ఈ ఎన్నికల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేతలకు ఊరట కల్పిస్తూ కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని బాధ్యతలు తీసుకున్న తొలిరోజే పరిషత్ ఎన్నికల షెడ్యూల్ గురువారం విడుదల చేశారు.

చీఫ్ సెక్రటరీ ఆదిత్య నాథ్ దాస్, డిజిపి గౌతమ్ సావాంగ్ ను సంప్రదించిన తరువాత కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ ఈ షెడ్యూల్ ను విడుదల చేశారు. షెడ్యూల్ను విడుదల చేయడానికి ముందు  నీలం సాహ్ని సుధీర్ఘంగా జిల్లా కలెక్టర్లు మరియు ఎస్పీలతో రెండు గంటల పాటు  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. కోవిడ్ 19ను కారణంగా చూపిస్తూ 2020 మార్చిలో అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ ఎన్నికలను నిలిపివేశారు. అన్ని ఎన్నికలు, పరిషత్, పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలను ఆరు వారాలపాటు  నిలిపివేశారు.

రాష్ట్ర ప్రభుత్వంతో ఏడాది పొడవునా న్యాయ పోరాటం తరువాత, రమేష్ కుమార్ 2021 మార్చి 31 న పదవీ విరమణ చేసే ముందు పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు నిర్వహించారు.  2021 ఏప్రిల్ 1 న బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ పరిషత్ ఎన్నికలు పూర్తయ్యేలా వెంటనే నోటిఫికేషన్ జారీ చేశారు.

కొత్త షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 8న పోలింగ్ మరియు ఏప్రిల్ 10 న లెక్కింపు జరుగుతుంది. కొత్త ఎన్నికల కమిషనర్ 2020 మార్చికి ముందు ఎన్నికల ప్రక్రియలో అవకతవకలపై ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదని దీని అర్థం.
Tags:    

Similar News