తుదిశ్వాస విడిచిన మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్‌జీ టండన్ !

Update: 2020-07-21 08:03 GMT
మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్‌జీ టండన్ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. జూన్ 11 న ఆయన శ్వాస సంబంధిత వ్యాధితో యూపీలోని ఓ ప్రైవేట్  ఆస్పత్రిలో చేరారు. ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజుఉదయం  తుది శ్వాస విడిచారు.  లాల్‌జీ టండన్ మరణాన్ని ఆయన కుమారుడు, యూపీ ప్రభుత్వ మంత్రి అశుతోష్ టండన్ తెలిపారు. బాబూజీ ఇక లేరని ఆయన ట్వీట్ చేశారు. కొద్దిరోజులుగా టండన్ కు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఆయన మరణించినట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం టాండన్ కు 85 ఏళ్ల వయస్సు ఉంటుంది.

లాల్‌జీ టండన్ ఆరోగ్యం రోజురోజుకు దిగజారుతున్న నేపధ్యంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ కు మధ్యప్రదేశ్ అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. మరోవైపు లాల్‌ జీ మరణం పట్ల మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తాజాగా ఆయన మరణంతో మరికొన్ని రోజులు మధ్యప్రదేశ్ గవర్నర్‌గా ఆమె అదనంగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్ మృతి పట్ల నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రాజకీయ నాయకులు ఆకాంక్షిస్తున్నారు. లాల్జీ టాండన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు.
Tags:    

Similar News