బీహార్ గవర్నరుగా మోత్కుపల్లి ?

Update: 2017-07-25 07:09 GMT
త్వరలో ఏడు రాష్ఱ్టాలకు కొత్త గవర్నర్లు రానున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా దీనిపై క్లారిటీ వచ్చేస్తుందని చెప్తున్నారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ర్టాలకు కూడా కొత్త గవర్నరు వస్తారని సమాచారం. ప్రస్తుత గవర్నరు నరసింహన్ ను కేంద్రానికి తీసుకెళ్లేందుకు మోడీ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఆయన స్థానంలో గుజరాత్ మాజీ సీఎం ఆనందీబెన్ ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
    
మరోవైపు ఎప్పటి నుంచో గవర్నరు గిరీపై గంపెడాశ పెట్టుకుని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులుకు ఈసారి అదృష్టం వరించనున్నట్లు తెలుస్తోంది. బీహార్ గివర్నరుగా ఉంటూ రామ్ నాథ్ కోవింద్ రాష్ర్టపతి కావడంతో ఆయన ప్లేసును భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఆ స్థానం మోత్కుపల్లికి ఇస్తారని తెలుస్తోంది. బీహార్లో నితీశ్ కుమార్ తో ఇప్పుడు మోడీ సర్కారుకు సఖ్యత కుదరడంతో అక్కడ పెద్దగా ఇబ్బందులేమీ ఇక ఉండకపోవచ్చు. దీంతో బీజేపీ నేతలే ఉండాల్సిన అవసరం లేదు. అందుకే బీహార్ కు మోత్కుపల్లిని గవర్నరు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
    
ఇక తెలుగు రాష్ఱ్టాల విషయానికొస్తే ఇప్పటివరకు కర్ణాటక బీజేపీ నేత శంకరమూర్తి పేరు ప్రచారంలో ఉంది. కానీ, ఇప్పుడు ఆనందీబెన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆనందీబెన్ తెలుగు రాష్ర్టాల గవర్నరు అయితే కుముద్ బెన్ జోషీ తరువాత ఇక్కడ రెండో మహిళా గవర్నరు అవుతారు.
Tags:    

Similar News