130 త‌ర్వాత పాతిక వ‌స్తాయా త‌మ్ముళ్లు?

Update: 2019-04-20 05:36 GMT
మొన్న‌టివ‌ర‌కూ తెలుగుదేశం పార్టీలో ఉండి.. బాబు స‌ర్కారు మీద ఏపీ ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న ప్ర‌జావ్య‌తిరేక‌త‌ను గుర్తించి పార్టీకి గుడ్ బై చెప్పిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వ్య‌వ‌హారం ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. స‌రిగ్గా ఎన్నికల వేళ‌.. పార్టీని వీడుతూ మోదుగుల తీసుకున్న‌నిర్ణ‌యం టీడీపీలో పెను సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే.

ఎన్నిక‌లు ముగిసి.. గెలుపు ధీమాను ఇరువ‌ర్గాలు ప్ర‌ద‌ర్శిస్తున్న వేళ‌.. రానున్న రోజుల్లో ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా రానున్నాయ‌న్న విష‌యాన్ని చెబుతున్న మోదుగుల మాట ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. గుంటూరు పార్ల‌మెంటు అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ఆయ‌న‌.. గుంటూరు జిల్లాలో టీడీపీకి వ‌చ్చే సీట్ల లెక్క చెబుతున్న తీరు తెలుగు త‌మ్ముళ్ల గొంతుల్లో త‌డి ఆరిపోయేలా చేస్తోంది.

జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉంటుంద‌న్న మాట‌ను చెబుతున్న ఆయ‌న‌.. మొత్తం 17 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు.. మూడు పార్ల‌మెంటు స్థానాల్లో టీడీపీ క‌నిపించింద‌న్న ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిగా నిర్ణ‌యించిన నేప‌థ్యంలో మిగిలిన జిల్లాల‌తో పోలిస్తే.. కృష్ణా.. గుంటూరు జిల్లాల‌కు చెందిన ప్ర‌జ‌లు అత్య‌ధికంగా లాభ‌ప‌డ్డారు. మ‌రి.. అలాంటి చోట కూడా టీడీపీకి ఎదురుగాలి వీస్తుంటే.. ఫ‌లితాలు ఎలా వ‌స్తాయో చెప్పాల్సిన అవ‌స‌రం లేదంటున్నారు.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు కుమారుడు లోకేశ్ బ‌రిలో ఉన్న మంగ‌ళ‌గిరిలో 20వేల ఓట్ల తేడాతో ఓడిపోనున్న‌ట్లుగా మోదుగుల చెబుతున్నారు. ఎన్నిక‌ల వార్ వ‌న్ సైడ్ గా న‌డిచింద‌ని.. ఫ‌లితాలు అనూహ్యంగా వ‌స్తాయ‌ని చెబుతున్నారు. ఏపీలో టీడీపీ ప‌రిస్థితి 13 సీట్ల‌కు ఎక్కువ‌.. పాతిక సీట్ల‌కు త‌క్కువ అన్న‌ట్లు ఉంద‌ని.. అలాంటిది 130 సీట్లు వ‌స్తాయ‌ని తెలుగు త‌మ్ముళ్లు చెప్ప‌టంలో అర్థం లేదంటున్నారు. తుది ఫ‌లితాలు ఎలా ఉన్నా.. డీప్ గా స్ట‌డీ చేసిన‌ట్లుగా ఉన్న మోదుగుల మాట‌లు విన్నంత‌నే తెలుగు త‌మ్ముళ్ల‌కు వ‌ణుకు పుట్టేలా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News