జగన్ బ్యాచ్ పై కేసు బుక్ అయ్యింది

Update: 2016-03-07 04:25 GMT
ఇటీవల కాలంలో ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన మీడియా సంస్థలో రాజధాని దురాక్రమణ పేరిట భారీ కథనాలు సీరియల్ గా ప్రచురించటం.. ఛానల్ లో టెలికాస్ట్ కావటం తెలిసిందే. ఈ ఉదంతంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేశ్ మొదలుకొని పలువురు మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు బినామీల పేరిట భారీ భూదందాకు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేయటం తెలిసిందే.

ఈ సందర్భంగా తాము చేస్తున్న ఆరోపణలకు కొన్ని ఆధారాల్ని చూపించారు. దీనిపై ఏపీ అధికారపక్షం తీవ్రస్థాయిలో మండిపడింది. ఇదిలా ఉంటే.. ఏపీ అధికారపక్షానికి చెందిన గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర జగన్ అండ్ కోపై పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా వార్తలు ప్రచురించారని.. చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు 13 మందిపై ఆయన ఫిర్యాదు చేశారు. ధూళిపాళ్ల నరేంద్ర ఫిర్యాదు చేసిన జగన్ బ్యాచ్ ను చూస్తే..

1.        కె. రామచంద్రమూర్తి (ప్రింటర్.. పబ్లిషర్ ఆఫ్ సాక్షి తెలుగు డైలీ న్యూస్ పేపర్)

2.        వి. మురళి (ఎడిటర్)

3.        వైఎస్ భారతీ రెడ్డి (ఛైర్ పర్సన్ ఆఫ్ జగతి పబ్లికేషన్స్)

4.        హన్నప్పనహల్లి వీరన్న (డైరెక్టర్)

5.        వై. ఈశ్వరప్రసాద్ రెడ్డి (డైరెక్టర్)
Read more!

6.        వి. శ్రీధర్ రెడ్డి (డైరెక్టర్)

7.        రాజప్రసాద రెడ్డి (డైరెక్టర్)

8.        పీవీకే ప్రసాద్ (డైరెక్టర్)

9.        ప్రకాశరావు (డైరెక్టర్)

10.     అంతుర్ నారాయణ్ (డైరెక్టర్)

11.     ఎల్ బలరాం రెడ్డి (ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ డైరెక్టర్)

12.     వీర్మణి బాల రాజు (ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ డైరెక్టర్)

13.     బండి రాణిరెడ్డి (ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ డైరెక్టర్)
Tags:    

Similar News