చార్టర్డ్ ప్లేన్లకు పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే..
ఇండిగో కార్యాచరణలో వచ్చిన భారీ అంతరాయం వరుసగా మూడో రోజుకు చేరుకోగా, దేశ వ్యాప్తంగా వాణిజ్య విమానాల రద్దు, ఆలస్యాలు భారత ప్రైవేట్ విమానయాన రంగాన్ని ఊహించని రీతిలో కలవరపరిచాయి.;
ఇండిగో కార్యాచరణలో వచ్చిన భారీ అంతరాయం వరుసగా మూడో రోజుకు చేరుకోగా, దేశ వ్యాప్తంగా వాణిజ్య విమానాల రద్దు, ఆలస్యాలు భారత ప్రైవేట్ విమానయాన రంగాన్ని ఊహించని రీతిలో కలవరపరిచాయి. పెద్ద ఎత్తున చిక్కుకున్న ప్రయాణికులు తక్షణ ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నించడం వల్ల చార్టర్ ఫ్లయిట్ లకు డిమాండ్ పెరిగింది, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చే విచారణలు రికార్డు స్థాయికి చేరాయి.
చార్టర్డ్ ప్రయాణం తప్పనిసరి..
డిసెంబర్ 4 తర్వాత, వ్యాపార ప్రముఖులు, కుటుంబాలు, తక్షణ ప్రయాణం అవసరమైన ప్రయాణికులు.. అందరూ చివరి నిమిషం పరిష్కారంగా ప్రైవేట్ చార్టర్లను ఆశ్రయిస్తున్నారు. పూణేకు చెందిన నైబ్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ కేవలం 48 గంటల్లో ప్రైవేట్ చార్టర్ల విచారణలు ఐదు రెట్లు పెరిగాయని తెలిపింది. కంపెనీ అకౌంటబుల్ మేనేజర్ సౌరభ్ జాంగిడ్ మాట్లాడుతూ, ‘రోజుకు సాధారణంగా 10 విచారణలు వస్తాయి. ఇప్పుడు ఆ సంఖ్య 50కి చేరింది; వాటిలో పావు వంతు హైదరాబాద్ నుంచే అని చెప్తూ.. ముంబై, అహ్మదాబాద్ నుంచి కూడా భారీ డిమాండ్ వస్తోంది’ అన్నారు. జాంగిడ్ వివరించినట్టుగా, చార్టర్ కోసం సాధారణం కంటే మూడు రెట్లు పెరిగి, రోజుకు 2–3 చార్టర్ల నుంచి 6–7 చార్టర్ల వరకు దూసుకెళ్లాయి. కంపెనీకి చెందిన మూడు విమానాలు పూర్తిస్థాయిలో నడుస్తుండగా, అదనపు అవసరాల కోసం భాగస్వామి ఆపరేటర్ల సాయం తీసుకుంటున్నారు.
కార్పొరేట్ ప్రయాణికులే అధికం..
కార్పొరేట్ ప్రయాణికులే ప్రధాన గ్రూప్‌గా నిలిచినా, కుటుంబాలు కూడా ప్రైవేట్ జెట్‌లను ఎక్కువగా ఎంచుకుంటున్నాయి. ఒక సందర్భంలో వాణిజ్య విమానాల అంతరాయాల కారణంగా ఢిల్లీ కుటుంబం అయోధ్యలోని మహుర్తానికి ఆలస్యం కాకుండా ఉండేందుకు ప్రత్యేక చార్టర్‌ను అద్దెకు తీసుకుంది. మెడికల్ ప్రయాణాలకు సంబంధించిన ఎమర్జెన్సీ అభ్యర్థనలు కూడా పెరిగాయి.
దోరణిని గమనిస్తున్న వివిధ చార్టర్డ్ సంస్థలు..
ఢిల్లీకి చెందిన బాణం చార్టర్స్ కూడా ఇదే ధోరణిని గమనిస్తోంది. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శైలేంద్ర సింగ్ మాట్లాడుతూ ‘సాధారణంగా ఖాళీగా ఉండే ఎంబ్టీ-లెగ్ విమానాలు కూడా నిమిషాల్లో బుక్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో లభ్యత పెట్టగానే బ్లాక్ అయిపోతున్నాయి’ అన్నారు. కొన్ని రోజుల్లో చార్టర్ కార్యకలాపాలు రెట్టింపయ్యాయి. అవసరాన్ని తీర్చేందుకు జెట్లు, హెలికాప్టర్లను కూడా వినియోగిస్తున్నారు.
భారీగా పెరిగిన టికెట్ ధరలు..
దేశీయ విమాన ఛార్జీల పెరుగుదల చార్టర్ ప్రయాణాల వైపు మరింత మంది ప్రయాణికులను నెడుతోంది. హైదరాబాద్–ఢిల్లీ రూట్‌లో టికెట్ ధరలు ₹22,000 నుంచి ₹50,000కు ఎగబాకగా, ఢిల్లీ–బెంగళూరు ఛార్జీలు ₹36,000 నుంచి ₹56,000 మధ్యకు పెరిగాయి. బెంగళూరు–ముంబై టికెట్లు ₹45,000 దాటగా, హైదరాబాద్–భోపాల్ ఎయిర్ ఇండియా ఎకానమీ సీటు చివరి నిమిషంలో ₹1 లక్ష దాటింది.
గో..నౌకే ఎక్కువ ప్రధాన్యం..
ఈ నేపథ్యంలో చాలా మంది ప్రయాణికులు ‘గో–నౌ’ కోసం అడుగుతున్నారు. కొందరు ముంబై వంటి మరో నగరం నుంచి ఫెర్రీ చేసి విమానం తెప్పించేందుకు 2–3 గంటల అదనపు సమయానికి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం చిన్న 6 సీట్ల విమానాలకు గంటకు ₹2.5 లక్షలు, ఎనిమిది సీట్ల విమానాలకు గంటకు ₹4 లక్షల వరకు చార్టర్ ధరలు ఉన్నాయి.
వాణిజ్య విమానాలకు ఇబ్బంది..
అయితే ప్రైవేట్ విమానయాన రంగం కూడా సవాళ్లను ఎదుర్కొంటోంది. చార్టర్ పైలట్లు సాధారణంగా వాణిజ్య విమానాల రూటులో ప్రయాణించేవి కావడంతో ఆ విమానాలు ఆలస్యం కావడం రద్దు కావడం వల్ల ఇబ్బది ఎదురవుతుందని సదరు వ్యాపారులు చెప్తున్నారు. పూణే వంటి విమానాశ్రయాల్లో ఇండిగో గ్రౌండెడ్ విమానాలు ఏప్రాన్లను ఆక్రమించడం కూడా చార్టర్ విమానాలకు పార్కింగ్ ఇబ్బందులు కలుగుతున్నాయి.
సాధారణ స్థితికి చేరుకునే వరకు తప్పదు..
హైదరాబాద్‌కు చెందిన చార్టర్ సంస్థ సీనియర్ కెప్టెన్ బల్రాజ్ భుల్లర్ మాట్లాడుతూ, ‘విమానయాన కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకునే వరకు ఈ డిమాండ్ కొనసాగుతుంది. చాలా మంది సమయానికి ప్రాధాన్యం ఇస్తున్నారు; ధర ఇప్పుడు రెండో విషయంగా మారిపోయింది’ అన్నారు. ప్రైవేట్ విమానాల సహజ సామర్థ్యం 6–16 సీట్ల మధ్య ఉండడం వల్ల ఈ డిమాండ్‌ను ఒక్కసారిగా తట్టుకోవడం కష్టమవుతుందని ఆయన భావిస్తున్నారు.
ఇండిగో కార్యకలాపాల సంక్షోభం ఇంకా పరిష్కార దశలో లేకపోవడంతో, చార్టర్ ఆపరేటర్లు రాబోయే రోజుల్లో మరింత తీవ్రమైన డిమాండ్ కోసం సిద్ధమవుతున్నారు.
ఇండిగో యొక్క కార్యాచరణ సంక్షోభానికి ఇంకా స్పష్టమైన పరిష్కారం లేకపోవడంతో, చార్టర్ ఆపరేటర్లు ఇంకా చాలా రోజుల తీవ్రమైన డిమాండ్ ను ఆశిస్తున్నారు.