టీషర్టుతో ఎగ్జామ్ హాల్ కు గులాబీ ఎమ్మెల్యే!

Update: 2019-08-24 08:04 GMT
నిజమే.. ఆయన్ను పరీక్షగా చూస్తే తప్పించి.. ఎమ్మెల్యేగా గుర్తించలేరు. రోటీన్ కు భిన్నంగా.. ఖద్దరు బట్టలకు.. వైట్ అండ్ వైట్ కు పూర్తి భిన్నంగా కుర్రాడిలా టీ షర్టు వేసుకొని వచ్చిన పరీక్ష రాస్తున్న ఆయన్ను చూసిన వారంతా షాక్ తినే పరిస్థితి. ఎందుకంటే.. ఆయన మామూలు వ్యక్తి కాదు. ఎందుకంటే.. ఆయన అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే.

నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మిగిలిన వారికి కాస్త భిన్నంగా. ఎమ్మెల్యే అయ్యాక కూడా చదువు మీద తనకున్న ఆసక్తిని కోల్పోలేదు. కాకతీయ వర్సిటీలో ఎల్ ఎల్ ఎం చేస్తున్న ఆయన.. తాజాగా ఎగ్జామ్స్ రాశారు. నేతలు పదవుల్లో ఉండగా పరీక్షలురావటం ఇదే తొలిసారి కాకున్నా.. జీవన్ రెడ్డి మాదిరి టీ షర్టుతో కుర్రాడిలా వచ్చి  పరీక్షలు రాని నేతలు తక్కువనే చెప్పాలి.

ప్రస్తుతం హన్ముకొండలోని ఆదర్శ లా కాలేజీలో ఎల్ఎల్ఎం ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్న జీవన్ రెడ్డి..బిజీబిజీగా ఉండే ప్రజాసేవలోనూ  కాస్త టైం దొరకబుచ్చుకొని చదువుకొని సీరియస్ గా పరీక్షలు రాసిన వైనం అక్కడి వారిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆర్మూరు నియోజకవర్గం నుంచి రెండోసారి అధికారపార్టీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న జీవన్ రెడ్డి తాజాగా జరుగుతున్న ఎగ్జామ్స్ కు సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నట్లు చెబుతున్నారు. ఆల్ ద బెస్ట్ చెబుదాం.
Tags:    

Similar News