• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మిథాలి యే నాకు స్ఫూర్తి..

మిథాలి యే నాకు స్ఫూర్తి..

By - Tupaki Desk
Update: 2021-05-21 11:30 GMT
హైదరాబాద్​కు చెందిన మహిళా క్రికెటర్​ అరుంధతి రెడ్డి .. ఇటీవల ఇంగ్లండ్​ టూ   ర్​ కు  ఎంపికయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నారు. ఇదివరకు టీ20 ఫార్మాట్​ లో మాత్రమే ఆడిన అరుంధతి తొలిసారిగా వన్డే ఫార్మాట్​ కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ ఇంగ్లాండ్​ టూర్​ లో ఆడటం నా కల. అది ఇప్పుడు నేరవేరబోతుంది. నాకు టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాల్ రాజ్​ ఆదర్శం. ఆమె క్రికెట్​ చూస్తూనే నేను పెరిగాను. ఆమె దగ్గరే అనేక మెలకువలను నేర్చుకున్నాను.

నేను ఇవాళ ఇంగ్లండ్​ టూర్​ కు ఎంపికయ్యానంటూ అందుకు కారణం మిథాలి అక్కే’ అని పేర్కొన్నారు.’నేను జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన సమయంలో మిథాలి అక్క జట్టులో ఉంది. ఆమె సహకారాన్ని నేను మరవలేను. రైల్వేస్​ తరఫున కూడా ఆమె కెప్టెన్సీలో ఆడా. తోటి క్రీడాకారిణిగా, హైదరాబాద్​ ప్లేయర్​ గా మిథాలి అక్క నాకు ఎంతో సహకారం అందించింది. పలు సందర్భాల్లో నాకు ధైర్యం ఇచ్చింది’ అని అన్నారు.

అది తప్పే..!

ఇటీవల లక్నోలో సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో నేను దిద్దుకోలేను తప్పు చేశాను.  నా తప్పు వల్లే ఆ మ్యాచ్​ ఓడిపోయాం. చివరి ఓవర్లో సఫారీ జట్టు 9 పరుగులు చేయాల్సి ఉండగా...తొలి 4 బంతుల్లో 3 పరుగులే ఇచ్చాను. తర్వాతి 3 బంతుల్లో 6 పరుగులు కావాలి. అయితే ఐదో బంతి ‘నోబాల్‌ 'గా వేశాను. నేను నోబాల్​ వేయకుంటే మ్యాచ్​ గెలిచేది. ఇంకోసారి ఇటువంటి తప్పులు జరగకుండా చూసుకుంటాను.

అంతర్జాతీయ క్రికెట్​ లోకి అరంగేట్రం చేశాక.. నా బౌలింగ్ లో ఎన్నో మార్పులు చేసుకున్నాను.నేను ప్రతిరోజు ఏదో ఒక పాఠం నేర్చుకుంటాను. నాకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మెరుగ్గా రాణిస్తా’ అంటూ అరుంధతి రెడ్డి తన మనసులోని మాటను పంచుకున్నారు.
Tags:    
  • Mithali 
  • Mithali inspire 
  • Political News 
  • Breaking News 
  • Latest News 

Similar News

చిన్న‌మ్మ‌ స‌మ‌ర్థ‌న.. అంతా బాగున్న‌ట్టేనా.. !

2026-11-12 12:30 GMT

సర్పంచ్ పదవికి రూ.కోటిన్నర.. ఎకరం పొలం.. పల్లెల్లో మొదలైన సందడి

2026-11-12 11:41 GMT

సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్ : ఏపీకి రూ. 32.49 లక్షల కోట్ల పెట్టుబడులు

2026-11-12 11:34 GMT

టీవీకేలో 'అడ్వాన్స్' రాజీనామాలు.. సీఎం విజయ్ ఏంటయ్యా ఇదీ?

2026-11-12 11:30 GMT

రాజకీయాలకు అతీతంగా తెలుగుబిడ్డకు గౌరవం ఇచ్చిన చంద్రబాబు

2026-11-12 11:00 GMT

చంద్రబాబు హిట్ లిస్టులో ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు, త్వరలో నిర్ణయం

2026-11-12 10:30 GMT

సాయిరెడ్డి గాలి తీసేసిన పాల్‌!

2026-11-12 10:17 GMT

పీఆర్‌పీ చీఫ్.. ఎవ‌రీ సాయిరెడ్డి.. ఈ విష‌యాలు తెలుసా?!

2026-11-12 10:17 GMT

ట్రంప్ పట్టుకొచ్చాడు.. అతడు వచ్చాడంటే ‘హెచ్1బీ’లకు మూడినట్టే?

2026-11-12 08:16 GMT

ట్రంప్ కు షాకిచ్చిన పాకిస్తాన్.. అమెరికా వ్యూహం ఎందుకు ఫెయిలయ్యింది?

2026-11-12 08:16 GMT

టేస్ట్ ఆఫ్ ఆంధ్రా' నుంచి డిజిటల్ పర్యాటకం వరకు.. సీఐఐ సదస్సు విశేషాలు!

2026-11-12 06:17 GMT

చీపురుపల్లి టీడీపీలో టెన్షన్.. టెన్షన్.. స్థానికంలో బొత్స దూకుడు

2026-11-12 06:05 GMT

Copyright @2026

Powered by Blink CMS