2016 మిస్ వరల్డ్ ను చూశారా?
మిస్ వరల్డ్ పోటీలు ముగిసాయి. సరికొత్త అందం ఇప్పుడు మిస్ వరల్డ్ గా అవతరించింది. టీనేజ్ నిండని అందాల బొమ్మ సరికొత్త ప్రపంచ సుందరిగా అవతరించింది. ఈ ఏడాది మిస్ వరల్డ్ కిరీటాన్ని పోర్టారికోకు చెందిన 19 ఏళ్ల స్టెఫైన్ డెల్ వాల్లే సొంతం చేసుకున్నారు. మొత్తం 116 మంది సుందరాంగులు పోటీ పడిగా.. పోర్టిరాకో టీనేజర్ కిరీటాన్ని సొంతం చేసుకుంది.
గత ఏడాది మిస్ వరల్డ్ గా స్పెయిన్ భామ మిరాయ లాలాగుణ విజేతగా అవతరిస్తే.. తాజాగా ఆ కిరీటాన్ని వాల్లే సొంతం చేసుకుంది. మిస్ వరల్డ్ కిరీటాన్ని పోర్టారికా భామలు సొంతం చేసుకోవటం ఇది రెండోసారి.
ఇదిలా ఉంటే.. మిస్ వరల్డ్ పోటీలో ఫైనలిస్ట్ గా డొమినికన్ రిపబ్లిక్ కు చెందిన యరిత్జా.. ఇండోనేషియాకు చెందిన నటాషాలు సెకండ్.. థర్డ్ ప్లేస్ లలో నిలిచారు. ఫైనల్ లోనిలిచిన టాప్ ఫైవ్ లో భారత్ ప్రాతినిధ్యం లేకపోవటం గమనార్హం. ఇక.. విజేతగా నిలిచిన వాల్లే మాట్లాడుతూ.. తాను ఎంటర్ టైన్ మెంట్ రంగంలోకి అడుగు పెట్టాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసింది. ఐదు నిమిషాల డ్యాన్స్ కే కోట్లాది రూపాయిలు ఇచ్చే మనోళ్ల కన్ను మరీ ప్రపంచ సుందరి మీద పడుతుందో లేదో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/