యువతి పై 14 ఏళ్లుగా మంత్రి అత్యాచారం .. పవార్ సీరియస్...

Update: 2021-01-15 06:30 GMT
మంత్రి ధనుంజయ్ ముండేపై వచ్చిన లైంగిక ఆరోపణల మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దీనిని తీవ్రంగా పరిగణించారు. ఈ విషయం పై తాజాగా శరద్ పవార్ స్పందించారు. ఈ విషయంపై పార్టీ చర్చిస్తుందని, తొందర్లోనే ఓ నిర్ణయం తీసుకుంటామని పవార్ గురువారం ప్రకటించారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు చాలా సీరియస్. సహజంగానే పార్టీలో దీనిపై చర్చిస్తాం. దీనిపై పార్టీ ముఖ్యులతో చర్చిస్తాం. వారి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటాం. అతి తొందర్లోనే నిర్ణయం తీసుకుంటాం అని పవార్ ప్రకటించారు.

మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత ధనంజయ్ ముండేపై ఓ యువతి లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మంత్రిని బావగా పేర్కొన్న ఆ యువతి, తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 14 ఏళ్లుగా అత్యాచారం చేశారంటూ ఆమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలీవుడ్‌ లో అవకాశాలు ఇప్పిస్తానని ముండే తనను లోబర్చుకున్నారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని, కాపాడాలని పోలీసులను కోరింది. అయితే ఈ ఆరోపణలను మంత్రి ధనంజయ్ ముండే ఖండించారు.

Tags:    

Similar News