కేసీఆర్ జన్మదిన వేడుకల్లో అపశ్రుతి
హైదరాబాద్ లో నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం పంజాగుట్ట జీవీకే మాల్. ఈ ప్రాంతంలో ఉదయం, సాయంత్రం వాహనాలతో కిక్కిరిసి ఉంటుంది. ఈ క్రమంలో వచ్చిన మంత్రి వాహనం ప్రమాదానికి గురయ్యింది. ఆ ప్రమాదంలో అతడి కాన్వాయ్ లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో కార్లు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదం తెలంగాణ రోడ్డు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు సోమవారం జరిగింది. కేసీఆర్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేందుకు ప్రగతి భవన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
పంజాగుట్ట జీవీకే మాల్ వద్ద వెళ్తుండగా ఒక ద్విచక్ర వాహనదారుడిని తప్పించబోయి మంత్రి కాన్వాయ్ లోని ఓ వాహనం పక్కకు జరగ్గా.. అది గమనించకుండా వెనకున్న వాహనం ఢీకొట్టింది. దీంతో నాలుగు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే మంత్రి మరో కారులో ప్రగతి భవన్ కు వెళ్లారు. ఈ ప్రాంతంలో తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ట్రాఫిక్ పోలీసులు సరైన రీతిలో చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
మంత్రి కాన్వాయే ప్రమాదానికి గురయ్యారంటే ఇక సాధారణ ప్రజలు ఎలా రాకపోకలు సాగిస్తున్నారో అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా జీవీకే మాల్ చౌరస్తాలో వాహనాలు అడ్డదిడ్డంగా వెళ్తుంటాయి. ఇక్కడ వీఐపీ వాహనాలు అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తుండడంతో పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు పట్టించుకోవడం లేదు. ఒక రవాణా శాఖ మంత్రే రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. మరి ఆయన తన శాఖ తరఫున ఏమైనా చర్యలు తీసుకుంటాడో లేదో చూడాలి