మూడు వారాలు రెస్టు తీసుకునేంతలా కేటీఆర్ గాయం.. అసలేమైంది?
పేరుకు తెలంగాణ రాష్ట్ర మంత్రి అనే కానీ.. డిపాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నారన్న పేరు టీ మంత్రి కేటీఆర్ సొంతం. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడిగా సుపరిచితమైన రామ్.. గులాబీ బాస్ రాజకీయ వారసుడిగా ఇప్పటికే డిక్లేర్ చేయటం తెలిసిందే. సాధారణంగా ముఖ్యమంత్రిగా తండ్రి ఉన్నప్పుడు..కొడుకు మంత్రిగా వ్యవహరించటం అక్కడక్కడ జరుగుతుంది. అయితే.. కేటీఆర్ విషయంలో ప్రత్యేకత ఏమంటే.. ఆయన తనకంటూ ఒక మార్కు వేయించుకోగలిగారు. పెద్ద పెద్ద వేదికల మీద సైతం తనదైన ముద్రను వేసేలా వ్యవహరించటం కేటీఆర్ సొంతమని చెప్పాలి.
కొడుకులోని సామర్థ్యాన్ని గుర్తించిన సీఎం కేటీఆర్ ఆయనకు దశల వారీగా పార్టీ మీదా.. ప్రభుత్వంలోనూ పట్టు ఇవ్వటం కనిపిస్తుంది. తండ్రి ఇచ్చిన అవకాశాన్ని ఏ మాత్రం వదులుకోకుండా తనదైన ముద్రను వేస్తూ ముందుకు వెళుతున్నారు. సాధరాణంగా ఏదైనా రాష్ట్రంలో తండ్రి సీఎం.. కొడుకు మంత్రిగా ఉంటే.. ఓపెనింగ్స్.. సెమినార్లు.. పెద్ద పెద్ద డిబేట్లు.. ఇలాంటి వాటిలో పాల్గొనే విషయంలో కేటీఆర్ మిగిలిన వారి కంటే ఎక్కువగా హాజరవుతుంటారని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో.. మరి ముఖ్యంగా హైదరాబాద్ వేదికగా జరిగే కార్యక్రమాల్లో దాదాపు మంత్రి కేటీఆరే ముఖ్య అతిధిగా హాజరు కావటం తెలిసిందే.
ఈకారణంతోనే ఆయన తెగ బిజీగా ఉంటారు. ఒక్కోరోజు మూడు.. నాలుగు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనటం కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి కేటీఆర్ శనివారం మధ్యాహ్నం తర్వాత (ఉదయం కుత్భుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని మహేంద్రా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. రోటీన్ కు భిన్నంగా అక్కడ ఎక్కువసేపు గడిపిన మంత్రి కేటీఆర్..ఆ తర్వాత ప్రగతి భవన్ కు వెళ్లారు. అక్కడ ఆయన అనూహ్యంగా జారిపడ్డారు.
పడిన తర్వాత నడిచే విషయంలో తేడా కొట్టటం.. కాలు కదపటం కష్టంగా మారిన నేపథ్యంలో ఆయన్ను సోమాజీగూడలోని యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు మంత్రి కేటీఆర్ కుపరీక్షలు జరిపి.. ఎడమ కాలికి ఫ్యాక్చర్ అయిన వైనాన్ని గుర్తించారు. ఎడమ కాలి మడమ చీల మండలంలో క్రాక్ ఏర్పడినట్లుగా పేర్కొన్నారు. దీంతో.. ఆయన కాలికి పట్టీ వేసిన వైద్యులు.. మూడు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలన్న సూచన చేశారు. ఇదే విషయాన్ని ట్వీట్ రూపంలో మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పగలు.. రాత్రి అన్న తేడా లేకుండా నిత్యం తిరిగే మంత్రి కేటీఆర్.. కొద్ది రోజుల పాటు ఇంటి పట్టునే ఉండాల్సి వస్తుందన్న మాట.