రూ.5 మీల్స్ బాగుందన్న కేటీఆర్

Update: 2016-06-13 12:21 GMT
జనాలకు ఎలా కనెక్ట్ కావాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు.. మంత్రి కేటీఆర్ కు ఒకరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎలా వ్యవహరించాలో.. ఎలా అందరి మనసులు దోచుకోవాలో ఆయనకు బాగానే తెలుసు. పుణ్యం.. పురుషార్థం లాంటివి ఒకే పని చేయటం ద్వారా టోకుగా సంపాదించుకోవటంలో ఆయన టాలెంటే వేరని చెప్పాలి. ఇటీవల కాలంలో నరకప్రాయంగా మారిన హైదరాబాద్ రోడ్ల గురించి ఈ మధ్య కాలంలో మీడియాలో తరచూ వార్తలు వస్తున్నాయి.

మరి.. ఏ వార్త ఆయన మనసును దోచుకున్నదో కానీ.. సోమవారం ఉదయాన్నే కారు తీసుకొని హైదరాబాద్ రోడ్ల మీద పడ్డారు. సాక్షాత్తు కేటీఆరే రంగంలోకి దిగటంతో ఒక్కసారి సీన్ మొత్తం మారిపోయింది. ఎంపీ మల్లారెడ్డి మొదలుకొని గ్రేటర్ కమిషనర్.. మేయర్ మొదలు వివిధ శాఖల ముఖ్య అధికారులు.. నేతలంతా కేటీఆర్ కాన్వాయ్ ను ఫాలో అయ్యారు. మీడియాలో వస్తున్న దానికి మించి రోడ్లు దారుణంగా ఉండటంతో.. గ్రేటర్అధికారుల పని తీరు మెరుగుపడాలని చెప్పటమేకాదు.. రోడ్ల విషయంలో ఇప్పటివరకూ అనుసరిస్తున్న విధానాల్ని సమూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని తేల్చారు.

గ్రేటర్ రోడ్ల గురించి ముఖ్యమంత్రి గతంలోనే తన సందేశాన్ని ఇచ్చేశారని. ఒక్క గుంతలేని మహానగరరోడ్లను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందన్న కేటీఆర్.. రోడ్ల పని తీరు మారాలంటూ గట్టిగా చెప్పేశారు. తిరిగి.. తిరిగి అలిసిపోయారో.. లేక.. తన పర్యటనలో మరో ట్విస్ట్ ఇవ్వాలనుకున్నారో కానీ.. శ్రామికులు నిత్యం ఎంతో ఆబగా తినే రూ.5 భోజనాన్ని తినేందుకు కేటీఆర్ రెఢీ అయ్యారు.

బడుగు.. బలహీన వర్గాలు మాత్రమే తినే రూ.5 భోజనాన్ని కేటీఆర్ తినటానికి రెఢీ కావటంతో.. ఎంపీ మల్లారెడ్డితో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ మొదలు అందరూ తలా ఒక ప్లేట్ తీసుకొని భోజనం చేశారు. రోడ్ల ఇష్యూలో తీవ్ర అసంతృప్తికి గురైన కేటీఆర్ కు సాంత్వన కలిగించేలా భోజనం  ఉండటంతో ఆయన టేస్ట్ మీద సంతృప్తి వ్యక్తం చేయటంతో పాటు.. భోజనం బాగుందని సర్టిఫికేట్ ఇచ్చేశారు. కేటీఆర్ దెబ్బకు ఇక.. ఓ రేంజ్ వాళ్లు సైతం తినేయటం మొదలు పెట్టేస్తారేమో చూడాలి. ఏది ఏమైనా రూ.5 భోజనాన్ని తిన్నామంటే తిన్నమన్నట్లు కాకుండా.. కేటీఆర్ తిన్న తీరు చూసినప్పుడు ఆయన సక్సెస్ సీక్రెట్ ఏమిటో ఇట్టే అర్థమైపోతుందనే చెప్పాలి.
Tags:    

Similar News