మంచి దొంగ: బైక్ ను దొంగిలించి మళ్లీ పార్సిల్ చేసాడు ..అసలు కథ ఇదే !

Update: 2020-06-04 00:30 GMT
ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న ప్రజలపై తీవ్రమైన ప్రాభవాన్ని చూపించింది.   వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి లాక్ డౌన్ అమలు చేయడం వల్ల లక్షలాది మంది ప్రజలు నిరుద్యోగులుగా మిగిలారు. ముఖ్యంగా వలస కార్మికులు అనేక అవస్థలు పడుతున్నారు. ఉన్నచోట ఉపాధిలేక ..తినడానికి తిండి లేక ..ఎన్నో వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే,  వైరస్ విజృంభణ నేపథ్యంలో పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్స్ లన్నీ నిలిచిపోయాయి.

దీనితో ఏం చేయాలో తోచని స్థితిలో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ నగరంలోని పల్లపాలాయం ప్రాంతంలో ప్రశాంత్ అనే వ్యక్తి తన భార్య పిల్లలను ఇంటికి చేర్చడానికి బైక్ ను దొంగిలించాడు. ఆ  బైక్ లో తన భార్య, పిల్లలతో కిలిసి 200 కిలోమీటర్లు ప్రయాణించి సొంత ఊరికి చేరుకున్నాడు. ఆ తర్వాత ఎంచక్కా ఆ బైక్ ను వాడుకోకుండా ఆ దొంగ ఆ బైక్ ను పార్సిల్ ఆఫీసుకు వెళ్లి తను ఎక్కడి నుండి దాన్ని తీసుకొచ్చాడో అక్కడికే పంపాలని నిర్ణయించుకున్నాడు.
 
ఇప్పుడు లాక్ డౌన్ నుండి అన్ని కార్యాలయాలు, ఆఫీసులు ఓపెన్ కావడం తో, ఓ పార్సిల్ ఆఫీసులో ఆ బైక్ ను బుక్ చేశాడు. కోయంబత్తూరు నగరంలోని పల్లపాలాయం ప్రాంతంలో మే నెల 18వ తేదీన తన షాపు ముందు పార్క్ చేసిన బైక్ ను ఎవరో దొంగిలించారని సురేష్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అయితే అకస్మాత్తుగా 15 రోజుల తర్వాత సురేష్ కు ఓ పార్సిల్ ఏజెన్సీ నుండి పార్సిల్ వచ్చిందంటూ ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ పార్సిల్ లో దొంగిలించబడిన బైక్ ను చూసి సురేష్ ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే 1400 రూపాయలు ఆ పార్సిల్ ఏజెంటుకు చెల్లించి తన బైక్ ను తీసుకున్నాడు. ఎవరో వలస కార్మికుడు ఈ బైక్ ను చోరీ చేసి ఉంటాడని, తన సొంతూరికి వెళ్లాక, దాన్ని తిరిగి పార్సిల్ ద్వారా పంపించాడని సురేష్ చెప్పారు. ఈ విషయం తెలిసిన వారంతా ప్రశాంత్ ను మంచి దొంగ అని అంటున్నారు.
Tags:    

Similar News