బీర్ టిన్ తో పార్లమెంట్ లోకి..చివరి ఎంట్రీ అంటూ భాగోద్వేగం!

Update: 2020-12-18 07:45 GMT
చట్టసభ .. ప్రజల కోసం , ప్రజా సంక్షేమ కోసం ఎన్నో చట్టాలు రూపొందేది ఆ చట్టసభలోనే కాబట్టి , వాటిని ప్రజలు పవిత్రమైన స్థలాలుగా భావిస్తారు. మన దేశంలోనే  కాదు , ఏ దేశమైనా దీనికి అతీతం ఏమీ కాదు. అలాంటి పార్లమెంట్‌ లోకి బీర్ టిన్‌ తో ఎంట్రీ ఇచ్చాడో సభ్యుడు. తన చిట్టచివరి ప్రసంగం సందర్భంగా బీర్ టిన్ ‌ను ఓపెన్ చేశారు. చివరి స్పీచ్ ఇచ్చారు. తనకు ఇదే చిట్టచివరి సమావేశం కాబోతోందని, ఇక ముందు అడుగు పెడతానో, లేదో తెలియదని భాగోద్వేగానికి గురైయ్యాడు.

ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే .. బీర్ టిన్ తో పార్లమెంట్ లోకి వచ్చిన ఆ సభ్యుడి పేరు జో కన్నింగ్‌హామ్. డెమొక్రటిక్ పార్టీ సభ్యుడు. దక్షిణ కరోలినాలోని ఫస్ట్ డిస్ట్రిక్ట్‌ కు ఆయన పార్లమెంట్‌ లో ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. వచ్చేనెల 3వ తేదీన ఆయన పార్లమెంట్ సభ్యత్వం ముగియబోతోంది. అమెరికా కాంగ్రెస్ ‌కు ఎన్నికైన వారి సభ్యత్వం రెండేళ్ల పాటు ఉంటుంది. 2018లో హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌ కు నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. వచ్చేనెల 3వ తేదీ నాటికి తన సభ్యత్వం ముగియబోతోండటంతో  హౌస్ ఆఫ్ కాంగ్రెస్‌ లో చిట్టచివరిసారిగా ప్రసంగించారు.ఈ మధ్య  జరిగిన అమెరికా ఎన్నికల్లో ఆయన పోటీ చేసి, ఓడిపోయారు. రిపబ్లికన్ అభ్యర్థి న్యాన్సీ మేస్.. ఆయనపై ఘన విజయం సాధించారు. దీనితో కొత్త సభలో ఆయన అడుగు పెట్టే వీలు లేకుండా పోయింది.

ఇక ,తన చివరి ప్రసంగం సందర్భంగా కన్నింగ్‌ హామ్, దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రస్తావించారు. కరోనా వంటి పరిస్థితులు అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభాావం చూపాయని చెప్పుకొచ్చారు. రిపబ్లికన్ల ప్రభుత్వ వైఫల్యాలు కూడా తోడయ్యాయని చెప్పారు. జో బిడెన్ సారథ్యంలో ఏర్పడబోయే డెమొక్రటిక్ పార్టీ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుతుందని ఆశిస్తున్నానని అన్నారు. ప్రజానుకూలంగా కాకుండా..సొంత మనుషుల కోసం పని చేస్తున్నట్లుగా అనిపిస్తోందని చెప్పారు. తన రెండేళ్ల సభ్యత్వ కాలం త్వరలో ముగియబోతోన్నందున.. తనకు ఇష్టమైన సబ్జెక్ట్‌ తో  వచ్చానని చెప్పారు. ఆ తర్వాత తన బ్లేజర్ వెనుక దాచిన బీర్ టిన్‌ ను ఓపెన్ చేశారు.  అయితే, ఆయన తాగలేదు. టేబుల్‌పై ఉంచి, ప్రసంగాన్ని కొనసాగించారు.
Tags:    

Similar News