‘‘మెలియోఐడోసిస్’’ మహా డేంజరస్ కిల్లర్
స్వైన్ ఫ్లూ.. డెంగ్యూ.. మలేరియా.. సుపరిచితమైన ఈ రోగాలకు ఎలా చెక్ చెప్పాలన్న విషయానికి సంబంధించి తలలు పట్టుకుంటున్న వేళ.. మరో పెద్ద సవాలు ఎదురవుతోంది. ఇప్పటికే ప్రాణాంతక వ్యాధులకు సరైన మందుల్ని కనిపెట్టలేక.. చెలరేగిపోతున్న బ్యాక్టీరియాలకు చెక్ పెట్టే పరిస్థితి లేక తలలు పట్టుకుంటున్న పరిస్థితి. తాజాగా.. ఇప్పుడు మరో ప్రాణాంతక బ్యాక్టీరియా విరుచుకుపడుతోంది. ‘‘మెలియోఐడోసిస్’’ అన్న బ్యాక్టీరియా తన ప్రతాపాన్ని చూపిస్తోంది.
కేవలం రెండురోజుల వ్యవధిలోనే ప్రాణాలు తీసే ఈ ప్రమాదకారి అయిన బ్యాక్టీరియా గురించి ఆక్స్ ఫర్డ్ వర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. గాలి.. నీరు.. మట్టిలో విస్తృతంగా ఉండే బ్యాక్టీరియా కారణంగా ఈ వ్యాధి విరుచుకుపడుతుందని.. ఇది అటాక్ చేసిన రెండు రోజులకే ప్రాణాలు పోతాయని హెచ్చరిస్తున్నారు. దీనికి చెక్ చెప్పేందుకు ఇప్పటివరకూ సరైన మందు కనుక్కోలేదని.. ఈ వ్యాధిని కనుగొనటం కూడా కష్టమనే చెబుతున్నారు.
ప్రాణాలు తీసే ఈ భయంకర వ్యాధి దక్షిణాసియాలో.. అందునా భారత్ లో పెరుగుతుందని చెబుతున్నారు. వ్యాధి సోకిన వెంటనే చికిత్స అందని పక్షంలో కేవలం రెండురోజుల వ్యవధిలోనే మరణిస్తారని.. ఇంత ప్రమాదకారి అయిన బ్యాక్టీరియాను కనుగొనటం కూడా కాస్త కష్టంతో కూడిన పనిగా చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ బ్యాక్టీరియా కారణంగా 1.65లక్షల మంది ప్రతి ఏటా మరణిస్తున్నట్లు చెబుతున్నారు.
నిర్మాణ రంగంలో అనుసరించే విధానాలతో ఈ భయంకర వ్యాధి వ్యాపిస్తోందని.. ఒక్కసారి ఈ వ్యాధి కానీ సోకితే.. దీనికి చెక్ చెప్పటం కష్టమని.. షుగర్.. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధ పడే వారికి ఈ వ్యాధి మరింత త్వరగా సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి.. ఈ ప్రాణాలు తీసే కొత్త బ్యాక్టీరియాకు మందు ఎప్పటికి వస్తుందో..? సాంకేతికంగా ఎంత అడ్వాన్స్ అవుతున్నామో.. మానవాళికి పోటీగా బ్యాక్టీరియా కూడా అంతే శక్తివంతం కావటం గమనించారా..?