ట్రంప్ కు దూరంగా మెలానియా షాకింగ్ ప్రవర్తన

Update: 2020-11-13 14:30 GMT
గెలిస్తే నీ వెంట ఉంటారు. ఓడితే దూరం జరుగుతారు.. రాజకీయాల్లో ఇది కామన్ . కానీ సొంత భార్య కూడా దూరం పెడుతోందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు దూరంగా జరిగి సైనికుడి చేయిపట్టుకున్న ఆయన భార్య మెలానియా ప్రవర్తన తాజాగా  అందరినీ షాక్ కు గురిచేస్తోంది. ట్రంప్ ఓటమి ఖాయం అయిన తర్వాత ఇప్పటివరకు ఒక్కసారి కూడా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు.బయటకు కూడా అంతగా కనిపించలేదు. సోషల్ మీడియాలోనే ట్రంప్ స్పందిస్తున్నారు.

బుధవారం వెటరన్స్ డే సందర్భంగా ట్రంప్ ఆయన భార్య మెలానియాతో కలిసి బయటకు వచ్చారు. ఆర్లింగ్టన్ జాతీయ స్మశవాన వాటికను సందర్శించారు. అమెరికా ఆర్మీలో సేవలందించిన వారిని స్మరించుకునేందుకు ప్రతి ఏడాది నవంబర్ 11న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

అయితే ఈ కార్యక్రమంలో అమెరికన్ ప్రథమ మహిళ మెలానియా ప్రవర్తించిన తీరు అక్కడి వారిని షాక్ కు గురిచేసింది. మెలానియా మాస్క్ పెట్టుకోకుండా కోవిడ్ నిబంధనలు పాటించకుండా తుంగలో తొక్కిన వైనం చర్చనీయాంశమైంది. ఇదే కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఇవాంకలు ఫేస్ మాస్కులతో సామాజిక దూరం పాటిస్తూ కనిపించారు.

ట్రంప్ ఫేస్ మాస్క్ ధరించి సైనికులకు దూరంగా జరిగారు. కానీ మెలానియా మాత్రం ట్రంప్ ను పట్టుకోకుండా ఓ సైనికుడి చేయి పట్టుకొని అతడితోనే నడవడం అందరినీ షాక్ కు గురిచేసింది. తన వింత ప్రవర్తనతో ఈ కార్యక్రమానికి వచ్చిన అందరినీ దిగ్బ్రాంతికి గురిచేసింది.దీన్ని బట్టి ట్రంప్ కు, మెలానియాకు పడడం లేదని.. త్వరలోనే మెలానియా విడాకులు ఇవ్వబోతోందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ట్రంప్ అధ్యక్ష పీఠం నుంచి దిగగానే ట్రంప్ ను మెలానియాను వదిలేస్తుందని ట్రంప్ మాజీ రాజకీయ సహాయకురాలు న్యూమాన్ మానిగోల్డ్ స్పష్టంచేసింది. దీంతో ఈ ఊహాగానాలకు మరింత తెరలేచింది.
Tags:    

Similar News